రాజస్థాన్ జోధ్‌పుర్‌లో జరిగిన ఓ వివాహ వేడుక చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ఓ యువజంట హిందూ సంప్రదాయ ప్రకారం పరిణయమాడి ఒక్కటైంది.
మనోడి చొరవతో
జోధ్‌పుర్‌కు చెందిన వీరేంద్ర భండారి... వ్యాపార పనులపై తరచూ జపాన్‌కు వెళ్లివస్తుండేవాడు. ఈ క్రమంలో అక్కడ తన మిత్రుడైన జపాన్ దేశస్థుడు 'కాజుకీ' త్వరలో వివాహం చేసుకోనున్నట్లు వీరేంద్రకు చెప్పాడు.
అప్పుడు వీరేంద్ర... హిందూ సంప్రదాయ పెళ్లి గొప్పతనాన్ని కాజుకీకి వివరించాడు. భారతీయ పద్ధతిలో వివాహం చేసుకోవడం వల్ల వధూవరులు జీవితకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉంటారని తెలిపాడు. వెంటనే తన పెళ్లిని హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు కాజుకీ. వధువు కుటుంబాన్ని ఒప్పించి ఫిబ్రవరి 10న వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకున్నాడు. అలా వీరేంద్ర చొరవతో జోధ్‌పుర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నాడు కాజుకీ.
మంత్రోచ్ఛరణలను చక్కగా
పెళ్లి మంత్రాలను వధూవరులు చక్కగా హిందీలో ఉచ్చరించారు. ఈ వేడుకకు 25 మంది జపనీయులు, స్థానికులు హాజరై... కొత్త జంటను ఆశీర్వదించారు.
గతంలోనూ వీరేంద్ర జపాన్‌కు చెందిన ఓ యువజంటకు హిందూ సంప్రదాయంలో పెళ్లి జరిపించాడు.
ఇదీ చూడండి : అడవిలో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన ఎమ్మెల్యే