కశ్మీర్లో కమ్యూనికేషన్ సేవలను త్వరలోనే పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తున్నా.. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు వినియోగదారులను చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా ఉత్పత్తులన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయి పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత్యంతరం లేక కశ్మీర్ లోయలోని పలు పరిశ్రమలు ఇప్పటికే మూసేశారు.
జమ్ములోని ఛాంబర్ ఆఫ్ ట్రేడర్స్ ఫెడరేషన్ కశ్మీర్ నుంచి యాపిల్ వంటి త్వరగా పాడైపోయే సరుకులను రవాణా చేయడానికి ప్రత్యేక కారిడార్ కావాలని డిమాండ్ చేసింది. పలు సంస్థలు ఈ తరహా ఆందోళనలు చేపడుతున్నాయి.
"నేను యాపిల్ పరిశ్రమలో పనిచేస్తాను. ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినప్పటి నుంచి పరిశ్రమ మూతపడింది. సీజన్లో ఇలా మూతపడడం వల్ల మా వ్యాపారాలకు తీరని నష్టం చేకూరింది. ఆగస్టు 15 నుంచి నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడే వీలు లేకుండాపోయింది. వారికి నేనెలా ఉన్నానో కూడా సమాచారం లేదు."
-సతీష్, సహాయకుడు
ఇదీ చూడండి: కన్నయ్య బర్త్డే: చిన్ని కృష్ణుల ప్రపంచ రికార్డ్!