జమ్ము కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఓ భారత జవాన్ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. అయితే కుల్గాం జిల్లాలో సైనికుడి వాహనం కాలిపోయినట్లు గుర్తించారు. ఉగ్రవాదులే... జవాన్‌ను అపహరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
"ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్న షకీర్ మంజూర్ వాగ్హే... షోపియన్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. ఈద్ వేడుకల కోసం సెలవుపై వెళ్లిన షకీర్.. కారు చెడిపోవడం వల్ల ఇంటి వద్దనే ఉండిపోయారు. కుల్గాం జిల్లాలో ఆయన కారు కాలిపోయినట్లు గుర్తించాం. కానీ ఇంతవరకు షకీర్ జాడ తెలియలేదు."
-సైన్యాధికారులు
షకీర్ కనిపించకపోవడం వల్ల ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి: చినాబ్ నదిపై ఐఫిల్ టవర్ కంటే ఎత్తైన వంతెన