ETV Bharat / bharat

క్వారంటైన్​ గదుల ముందు తబ్లీగీల మలవిసర్జన! - క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేసిన తబ్లీగీలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తబ్లిగీ జమాత్​ సభ్యులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్​ నరేలా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఇద్దరు​ తబ్లీగీలు క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేయడమే ఇందుకు కారణం. సదరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Jamaat members defecate in front of Narela quarantine centre room
క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేసిన తబ్లీగీలు!
author img

By

Published : Apr 7, 2020, 7:46 PM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలకు కారణమైన తబ్లీగీ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న కార్యకర్తలు.. క్వారంటైన్​ కేంద్రాల్లో అనూహ్య రీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే కొందరు తబ్లీగీలు వైద్య సిబ్బందిపై దాడికి దిగగా.. మరో ఇద్దరు తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ నరేలాలోని క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేశారు. సంబంధిత అధికారుల నుంచి ఫిర్యాదు అందిన అనంతరం.. మలవిసర్జన చేసిన ఇరువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారు ఉత్తర్​ప్రదేశ్​ బారాబంకీకి చెందినవారని తెలిపారు.

గతనెలలో దిల్లీలోని నిజాముద్దీన్​ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారందరినీ ప్రస్తుతం నెరేలాలోని క్వారంటైన్​ కేంద్రాల్లో ఉంచారు అధికారులు. ఇందులో 212వ నెంబరు గది వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్నవారిలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మొత్తం 15 మంది మృతి చెందారు. అలాగే ఈ ప్రార్థనల్లో కనీసం 9000 మంది పాల్గొన్నట్లు ప్రభుత్వ అంచనా.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.