ETV Bharat / bharat

రామాలయం కోసం 2100 కిలోల భారీ గంట - Jalesar's Hindu, Muslim artisans

అయోధ్య రామమందిరం కోసం ఎంతో ప్రత్యేకమైన భారీ గంటను తయారు చేశారు యూపీలోని జలేసర్​ కళాకారులు. 25 మంది హిందు, ముస్లింలు కలిసి కొన్ని నెలల పాటు శ్రమించి 2100కిలోల అతిపెద్ద గంటను రూపొందించారు. మొత్తం 8 లోహాలను ఉపయోగించి అష్టదాతుతో దీన్ని తీర్చిదిద్దారు.

Jalesar's Hindu, Muslim artisans cast 2.1-tonne brass bell for Ram temple
రామాలయం కోసం 2100కిలోల గంట
author img

By

Published : Aug 9, 2020, 4:36 PM IST

అయోధ్యలో రామందిర నిర్మాణం కోట్లాది హిందువుల స్వప్నం. ఈ చారిత్రక ఆలయానికి సంబంధించనది ఏదైనా ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. అందుకే రామాలయం కోసం ఏకంగా 2100కిలోల గంటను తయారు చేశారు ఉత్తర్​ప్రదేశ్​ ఎటా జిల్లా జలేసర్​కు చెందిన​ కళాకారులు. నాలుగు నెలల పాటు శ్రమించి దీనిని రూపొందించారు. కేవలం ఇత్తడితో కాకుండా అష్టదాతులోని 8 లోహాలతో ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు. గంట తయారీకి రూపొందించిన అచ్చులో కరిగిన లోహాన్ని నిపేందుకు ఓ క్రేన్​ నే ఉపయోగించారు. మొత్తానికి అనుకున్న పని పూర్తి చేసి దేశంలోనే అతిపెద్ద గంటను సిద్ధం చేశారు.

ఈ గంట తయారీలో మరో విశేషం ఏమిటంటే దీని నమూనా రూపొందించింది ఓ ముస్లిం. ఆయన పేరు ఇక్బాల్ మిస్త్రీ. ఈ వృత్తిలో 30 ఏళ్ల అనుభవం ఉన్న దౌ దయాల్​ ఆధ్వర్యంలో 25 మంది కళాకారుల బృందం రోజుకు 8 గంటలపాటు శ్రమించి దీన్ని పూర్తి చేసింది.

తాము ఇప్పటివరకు ఇంత భారీ గంటను చూడలేదని వారు చెప్పారు. చారిత్రక రామమందిరం కోసం దీన్ని తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

" ఇంత భారీ పరిమాణంలో ఉన్న గంటను తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. నెలల తరబడి సాగే పనిలో ఏ చిన్న తప్పూ జరకుండా ఉండాలంటే ఎంతో శ్రమించాలి. రామాలయం కోసం ఈ గంటను తయారు చేయటం మాకు ఉత్తేజాన్నిచ్చింది. అలాగే విఫలమవుతామేమో అనే భయమూ మా మదిలో ఉండేది."

-దౌ దయాల్

కఠోర శ్రమ..

ఈ భారీ గంట తయారీ వెనుక కఠోన శ్రమ దాగి ఉందని చెప్పారు నమూనా రూపొందించిన ఇక్బాల్ మిస్త్రీ. కరిగిన లోహాన్ని అచ్చులో పోయడానికి 5 సెకన్లు ఆలస్యమైనా నెలల శ్రమ వృథా అయ్యేదన్నారు. పై నుంచి కిింది వరకు ఒకే శకలంతో గంటను తయారు చేయడం వల్ల తమ పని మరింత కష్టమైందని వివరించారు. గంట తయారీలో కేవలం ఇత్తడి మాత్రమే కాకుండా బంగారం, వెండి, కాంస్యం, జింక్​, సీసం, తగరం, ఇనుము, పాదరసం కలయికలో అష్టదాతును ఉపయోగించినట్లు చెప్పారు.

రూ.21 లక్షల ఖర్చు..

దేశంలోనే అతిపెద్ద గంటను రామమందిరానికి విరాళంగా ఇస్తామని చెప్పారు జలేసర్​ మున్సిపల్​ కౌన్సిల్ ఛైర్మన్ వికాస్ మిత్తల్​. ఈ గంటను తయారు చేసిన కర్మాగారానికి ఈయనే యజమాని.

అయోధ్యలో రామ మందిరం కోసం న్యాయపోరాటం చేసిన నిర్మోహి అఖాడా.. గతేడాది నవంబరులో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు అనంతరం 2100 కిలోల గంటను సిద్ధం చేయమని మిత్తల్​కు ఆర్డర్​ ఇచ్చింది.

"దైవ కారణంతోనే ఈ పని మా వద్దకు వచ్చింది.. అందుకే రూ.21లక్షల ఖర్చు చేసి తయారు చేసిన ఈ గంటను విరాళంగా ఇవ్వాలని భావిస్తున్నాం. ఉజ్జయిని మహంకాళేశ్వర్​ ఆలయంలో 1000 కిలోల గంటను కూడా మేమే తయారు చేశాం."

-వికాస్​ మిత్తల్​.

హిందువుల దశాబ్దాల కలను నెరవేర్చుతూ ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలోనే వేడుకను ఘనంగా నిర్వహించారు.

ఇదీ చూడండి: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి మోదీ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.