ETV Bharat / bharat

చైనా మంత్రి ఎదుటే డ్రాగన్​పై జైశంకర్​ పంచ్​! - భారత్ చైనా వార్తలు

అంతర్జాతీయ సంబంధాలను గౌరవించి, భాగస్వాముల ప్రయోజనాలను గౌరవించాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్​ వ్యాఖ్యానించారు. భారత్, రష్యా, చైనా త్రైపాక్షిక భేటీలో.. చైనాను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లోనూ సమకాలీక వాస్తవికతకు అనుగుణంగా సంస్కరణలు జరగాలని సూచించారు.

Jaishankar
జైశంకర్​
author img

By

Published : Jun 23, 2020, 4:55 PM IST

భారత్-రష్యా-చైనా త్రైపాక్షిక భేటీ వేదికగా విదేశాంగ మంత్రి జైశంకర్ పరోక్షంగా చైనాకు చురకలంటించారు. బహుముఖ వ్యవస్థలో ప్రతి దేశం... భాగస్వాముల న్యాయబద్ధమైన ప్రయోజనాలను గుర్తించి, అంతర్జాతీయ సంబంధాల సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు.

గల్వాన్‌ లోయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌ యీ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు జైశంకర్​.

"ప్రతి విషయంలోనూ అగ్రదేశాలు ఉదాహరణగా నిలవాలి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించటం, భాగస్వాముల న్యాయబద్ధమైన ప్రయోజనాలను గుర్తించటం, బహుముఖ వ్యవస్థలకు మద్దతివ్వటం, ఉమ్మడి వస్తువులను ప్రోత్సహించటమే మన్నికైన ప్రపంచ నిర్మాణానికి ఏకైక మార్గం."

- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి

చైనాను ఉద్దేశించేనా?

చైనాను ఉద్దేశించి జైశంకర్ ఇలా​ వ్యాఖ్యానించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్​తో సరిహద్దులతోపాటు హిందూ మహాసముద్రంలోనూ దూకుడుగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో చైనాకు పరోక్షంగా ఈ సందేశమిచ్చినట్లు అభిప్రాయపడుతున్నారు.

సమకాలీన మార్పులు అవసరం..

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్‌కు తగిన గుర్తింపు లభించలేదని జైశంకర్​ గుర్తు చేశారు. 75ఏళ్లుగా ఆ చారిత్రక అన్యాయాన్ని ఇంకా సవరించలేదని అన్నారు. ఈ నేపథ్యంలో భారత్​ చేసిన కృషిని ప్రపంచం గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఐక్య రాజ్య సమితిలో సంస్కరణలు తీసుకురావాలని అన్నారు జైశంకర్.

"అంతర్జాతీయ వ్యవహారాల్లో సమకాలీన వాస్తవికతకు అనుగుణంగా మార్పులు రావాలి. ఐరాస 50 దేశాలతో ప్రారంభమైంది. ఇప్పుడు 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అంగీకరించక తప్పదు. ప్రపంచ అజెండాను మార్చే క్రమంలో క్రియాశీలకంగా మన 3 దేశాలు ఉన్నాయి. బహుళపాక్షిక విధానాన్ని సంస్కరించేందుకు కృషి చేస్తామని ఆశిస్తున్నాం."

- జైశంకర్, విదేశాంగ మంత్రి

గల్వాన్​ ఘర్షణల నేపథ్యంలో త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల భేటీలో పాల్గొనేందుకు భారత్​ నిరాకరించింది. ఈ భేటీకి ఆతిథ్యమిచ్చిన రష్యా అభ్యర్థన మేరకు భారత్​ అంగీకరించింది.

ఇదీ చూడండి: భారత్​-చైనా రాజీ బాట... బలగాల ఉపసంహరణకు సై!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.