ETV Bharat / bharat

రాజ్యసభలో కాంగ్రెస్​ చీఫ్​ విప్​గా జైరాం రమేష్​​ - రాజ్యసభ కాంగ్రెస్​ చీఫ్​ విప్

కాంగ్రెస్​ పార్టీలో అసంతృప్త వాదులకు చెక్​ పెడుతూ.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయసభల్లో వారి ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ.. రాజ్యసభలో కాంగ్రెస్​ చీఫ్​ విప్​గా జైరాం రమేష్​ను నియమించారు. అహ్మద్ ​పటేల్​, కేసీ వేణుగోపాల్​లకు సభా సమన్వయ బాధ్యతలు అప్పగించారు.

Jairam Ramesh as congress chief whip in Rajyasabha
రాజ్యసభలో కాంగ్రెస్​ చీఫ్​ విప్​గా జైరాం రమేష్​​
author img

By

Published : Aug 28, 2020, 7:07 AM IST

కాంగ్రెస్​ పార్టీని ప్రక్షాలన చేయాలంటూ లేఖ రాసిన అసంతృప్త వాదులకు సోనియా గాంధీ చెక్​ పెట్టారు. ఉభయ సభల్లో వారి ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ రెండు వేర్వేరు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్​ చీఫ్​ విప్​గా సీనియర్​ నాయకుడు జైరాం రమేష్​​ను నియమించారు.

పార్టీ సమన్వయం కోసం..

పార్టీ సమన్వయం కోసం ఆయనతో పాటు తన రాజకీయ సలహాదారైన అహ్మద్​పటేల్​, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​లతో కమిటీ ఏర్పాటు చేశారు. అందులోనే రాజ్యసభ ప్రధాన ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్​, ఉప నాయకుడు ఆనంద్​శర్మలను సభ్యులుగా చేర్చారు. దీంతో ఇప్పటివరకు ఉన్న వీరి ప్రాధాన్యాన్ని తగ్గించినట్టయింది.

యువనేతలకు ఛాన్స్​..

అలాగే లోక్​సభలో సీనియర్​ నేతలైన మనీష్ తివారీ, శశిథరూర్​ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ అక్కడ ఉపనేత బాధ్యతలను అసోం యువనేత గౌరవ్ ​గొగొయ్​కి అప్పగించారు. విప్​గా పంజాబ్​లోని లుథియానా లోక్​సభ సభ్యుడు రవ్​నీత్​సింగ్​ బిట్టును నియమించారు. గౌరవ్​గొగొయ్​ మాజీ ముఖ్యమంత్రి తరుణ్​గొగొయ్​ కుమారుడు కాగా, రవ్​నీత్​సింగ్​ బిట్టు పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి సర్దార్​బియాంత్​సింగ్​ మనుమడు. ఈ యువనేతలిద్దరూ యూత్​ కాంగ్రెస్​ నుంచి రాజకీయంగా ఎదిగారు. లోక్​సభలో కాంగ్రెస్​ సభాపక్ష నేత అధిర్​ రంజన్​ చౌదరి, చీఫ్​ విప్​ కె.సురేశ్​, విప్​ మాణికిమ్​ ఠాగూర్​లతో కలిసి వీరిద్దరూ సభా సమన్వయ బాధ్యతలను చూసుకుంటారు.

ఇదీ చదవండి: 'కాంగ్రెస్​ పతనానికి అవే కారణాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.