అమాయకులైన పౌరులను ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు జమ్ముకశ్మీర్ పోలీసులు. వారు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కోసం పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో నిర్ధరణ అయింది.
బందీపొరా, సోపోర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో జమ్ముకశ్మీర్ పోలీసులు, 13 ఆర్ఆర్ బృందంతో కలిసి నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలోనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలు, మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో గ్రనేడ్లు, పిస్టోళ్లు ఉన్నాయి.
సరిహద్దుల వెంబడి ఉండే ఉగ్రవాదుల ఆదేశాల మేరకు అమాయకులైన పౌరులను ఉగ్రవాదులుగా మార్చడం, వారికి ఆయుధాలు చేరవేయడం ఆ నిందితుల కర్తవ్యమని పోలీసుల విచారణలో తేలింది.
ఇదీ చూడండి: ఆ అనుభూతిని పంచే 'గడపగడపకూ హరిద్వార్'