ETV Bharat / bharat

భారతీయ దుస్తుల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్​ - నమస్తే ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ దంపతులకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్వాగతం పలికిన కార్యక్రమంలో ఇవాంకా ట్రంప్​ భారతీయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ దుస్తులను ప్రముఖ డిజైనర్​ అనితా దోంగ్రే రూపొందించారు. గతంలో ఎంతోమంది ప్రముఖులకు దుస్తులను డిజైన్​ చేశారు దోంగ్రే.

ivanka
భారతీయ దుస్తుల్లో మెరిసిన ఇవాంకా ట్రంప్​
author img

By

Published : Feb 25, 2020, 5:04 PM IST

Updated : Mar 2, 2020, 1:09 PM IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వాగతం పలికిన కార్యక్రమంలో ట్రంప్‌ కుమార్తె, ఇవాంకా ట్రంప్‌ భారతీయ షేర్వానీలో మెరిసిపోయారు.

ఇవాంకా ధరించిన తెలుపు రంగు షేర్వానీని బంగాల్‌ పట్టుతో ప్రముఖ డిజైనర్‌ అనితా దోంగ్రే రూపొందించారు. ఈ డిజైన్‌ ఇరవై సంవత్సరాలనాటిదని తెలిపారు దోంగ్రే.

గతంలోనూ..

దోంగ్రె గతంలో బ్రిటన్‌ రాజ వంశస్థురాలు కేట్‌ మిడిల్టన్‌, బెల్జియం రాణి మాథిల్డే, కెనడా ప్రథమ మహిళ గ్రెగరీ ట్రూడో సహా హిల్లరీ క్లింటన్‌కు కూడా దుస్తులు డిజైన్‌ చేశారు.

ట్రంప్‌ సతీమణి మెలానియా తెల్లటి డ్రెస్‌పై ఎరుపు రంగు బెల్ట్‌ను ధరించారు. ఈ దుస్తులను వెనిజులాకు చెందిన ప్రముఖ డిజైనర్‌ కరోలినా హెర్రీరా రూపొందించారు.

ఇదీ చూడండి: భాజపాకు షాక్​- ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా 'బిహార్'​ తీర్మానం

Last Updated : Mar 2, 2020, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.