వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019కు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. పార్లమెంటు ఆమోదం లభించిన మరుసటి రోజునే బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్). అత్యున్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
పౌరసత్వ బిల్లు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది ఐయూఎంఎల్. భారత రాజ్యాంగం కల్పించే సమానత్వ హక్కులను ఈ బిల్లు హరిస్తుందని పిటిషన్లో పేర్కొంది.
ఐయూఎంఎల్ తరఫున కపిల్ సిబల్..
ఈ రిట్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అంగీకరించారు. ఐయూఎంఎల్ తరఫున బిల్లుకు వ్యతిరేకంగా వాదించనున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇదీ చూడండి: పంతం నెగ్గించుకున్న కేంద్రం- 'పౌర' బిల్లుకు పార్లమెంటు ఆమోదం