ETV Bharat / bharat

'కరోనా యోధులకు వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యమా?' - సుప్రీంకోర్టు

కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేతనాల సమస్యపై తాము జోక్యం చేసుకోలేమన్న సర్వోన్నత న్యాయస్థానం... కేంద్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

apex court
కరోనా పోరాడుతున్న వైద్యులను అసంతృప్తికి గురిచేయొచ్చు: సుప్రీంకోర్టు
author img

By

Published : Jun 12, 2020, 2:40 PM IST

కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందిని అసంతృప్తికి గురిచేయవద్దని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా యుద్ధం చేస్తున్న వైద్యులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. కొంత మంది వైద్యులకు వేతనాలు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది.

సమస్యను పరిష్కరించండి

వైద్యుల వేతనాలు చెల్లించకుండా నిలిపివేసిన అంశంపై న్యాయస్థానాలు కలుగజేసుకోకూడదని జస్టిస్ ఆశోక్ భూషణ్​, జస్టిస్ ఎస్​.కె.కౌల్​, జస్టిస్ ఎంఆర్​ షాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యుల వేతనాల చెల్లింపు సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంలో పిటిషనర్ల సలహాలు, సూచనలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఆదేశించింది.

కేంద్రం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... వైద్యులు మంచి సూచనలు చేస్తే, అందుకు తగ్గట్టుగా వారికి వసతి కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

జీతాలు ఇవ్వండి ప్లీజ్​!

వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తమ జీతాల కోత విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తాము ఓ వైపు కష్టపడుతుంటే... ప్రభుత్వాలు మాత్రం తమ వేతనాల్లో కోత విధించడం లేదా ఆలస్యంగా వేతనాలు చెల్లించడం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది వైద్యులకైతే పూర్తిగా జీతాలు చెల్లించడం లేదని వాపోయారు.

ఇదీ చూడండి: 'వారి మృతదేహాల నిర్వహణ భయానకం, దయనీయం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.