రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ), ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ఐటీఐ) సంయుక్తంగా భారత్‌లో కరోనా చికిత్సకు అవసరమయ్యే తేలికపాటి వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నాయి. డీఆర్డీఓ అందించే సాంకేతికత సహాయంతో వెంటిలేటర్లు తయారు చేయనున్నామని ఐటీఐ ఛైర్మన్ వెల్లడించారు.
పరీక్ష పూర్తి కాగానే..
ఒకసారి వెంటిలేటర్‌ను రూపొందించి, పరీక్షలు నిర్వహించిన అనంతరం తయారీ ప్రక్రియను వేగవంతం చేసి.. ఒకటి రెండు నెలల్లో వెంటిలేటర్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఐటీఐ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 50వేల వెంటిలేటర్లు ఉన్నట్లు సమాచారం. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా వేల కొద్దీ వెంటిలేటర్ల ఆవశ్యకత ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: దేశంలో 169కి చేరిన కరోనా మరణాలు