ETV Bharat / bharat

డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

తమిళనాడులో ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దివంగత నేత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలో ఆదాయపన్ను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నగదు నిల్వ ఉంచారన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఐటీ చర్యపై డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడి
author img

By

Published : Apr 16, 2019, 10:56 PM IST

Updated : Apr 16, 2019, 11:35 PM IST

తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల వేలూరు డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ కార్యాలయం, ఆయన సిమెంటు గోదాంలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. నేడు ఆ పార్టీ దివంగత నేత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలోనూ తనిఖీలు చేపడుతోంది.

ఓటర్లకు పంపిణీ చేసేందుకు పెద్దఎత్తున డబ్బు నిల్వ ఉంచారన్న సమాచారంతో తనిఖీ చేస్తోంది ఐటీ శాఖ. తూత్తుకుడిలో కనిమొళి ఉంటున్న నివాసంలో 10మంది ఐటీ అధికారుల బృందం సాయంత్రం నుంచి సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఐటీ దాడులపై డీఎంకే శ్రేణులు మండిపడుతున్నాయి. తూత్తుకుడిలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఐటీ దాడులపై డీఎంకే అధినేత స్టాలిన్​ ఆగ్రహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సుందరాజన్.. తన​ నివాసంలో కోట్ల డబ్బు దాచి ఉంచారని ఆరోపించారు. అధికారులు అక్కడ దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఓడిపోతామనే భయంతోనే ఐటీ, సీబీఐలను ఉపయోగించి ప్రధాని నరేంద్ర మోదీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

డీఎంకే నేత కనిమొళి నివాసంపై ఐటీ దాడులు

ఇదీ చూడండి: తమిళనాడు వేలూరు లోక్​సభ ఎన్నిక రద్దు

New Delhi, Apr 16 (ANI): While addressing mediapersons after Bharatiya Janata Party (BJP) delegation filed complained to the Election Commission, Union Minister of Law and Justice Ravi Shankar Prasad said, "We have strongly complain to the Election Commission to take cognisance and appropriate action against Rahul Gandhi for his continuously calling him (Prime Minister Narendra Modi) 'chowkidar chor hai'."
Last Updated : Apr 16, 2019, 11:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.