ఉగ్రవాదంపై పోరులో భారత భద్రతా దళాలు కీలక పురోగతి సాధించాయి. జమ్ముకశ్మీర్‌లో గత నాలుగు నెలల్లో 4 ఉగ్రవాద సంస్థలకు చెందిన ముఖ్య నాయకులను మట్టుబెట్టాయి.
"గత 4 నెలల్లో నాలుగు ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థానిక నాయకులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మరణించినవారు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, అన్సర్ ఘజ్వత్ అల్ హింద్‌కు చెందిన స్థానిక నాయకులు. వీరి మరణంతో స్థానికంగా ఆయా సంస్థల ఉగ్రకార్యకలాపాలను విజయవంతంగా తిప్పికొట్టినట్లు అయ్యింది."
- విజయ్ కుమార్, కశ్మీర్ ఐజీ ఆఫ్ పోలీస్
పాక్ అండతో వచ్చారు.. చచ్చారు
'కథువా ఎన్కౌంటర్లో మరణించిన పాకిస్థానీ ఉగ్రవాది 'అలీ భాయ్' పుల్వామాలో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తుంటాడు. పాక్ డ్రోన్ ద్వారా అతనికి ఎం-4 రైఫిల్లు అందినట్లు గుర్తించాం' అని విజయ్ కుమార్ తెలిపారు.
అలాగే కుల్గాం ఎదురుకాల్పుల్లో మరణించిన జైషే మహమ్మద్ ఉగ్రవాది నుంచి ఏకే 47, ఎం4 కార్బైన్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. పాకిస్థాన్ డ్రోన్ ద్వారానే ఉగ్రవాదులకు రైఫిళ్లు అందుతున్నట్లు తాము గుర్తించామన్నారు. శనివారం భద్రతా దళాలు కూల్చిన పాక్ డ్రోన్‌లో ఎం-4 రైఫిల్ ఉందని, దానిని తాము స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: బోర్డర్లో కొత్త రూల్స్- తుపాకులు వాడేందుకు సై!