కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా మూతబడిపోతున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు)కు తక్షణ నగదు సాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అలా చేయకపోతే ప్రభుత్వం నేరం చేసినట్లవుతుందని ఆరోపించారు.
"ఎంఎస్ఎంఈల్లో 11 కోట్లకుపైగా భారతీయులు ఉపాధి పొందుతున్నారు. ఇందులో మూడింట ఒక వంతు పరిశ్రమలు శాశ్వతంగా మూతపడనున్నాయి. అటువంటి వారికి ప్రభుత్వం సాయం చేయకపోవడం నేరం."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఎంఎస్‌ఎంఈల కోసం ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు రాహుల్.