చంద్రయాన్-2 బంధించిన భూమి ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో నేడు ట్విట్టర్లో పంచుకుంది. రెండు వారాల క్రితం నింగికేగిన చంద్రయాన్-2లో ఉన్న ఎల్ 14 కెమెరా ఈ చిత్రాలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఈ చిత్రాల్లో భూమి వివిధ కోణాల్లో కనిపించింది.
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో పలు చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇవన్నీ చంద్రయాన్-2 తీసిన చిత్రాలని వార్తలు వినిపించాయి. అయితే ఇస్రో వీటిని ఖండించింది. నేడు చంద్రయాన్-2 తీసిన భూమి ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది.
ఎవరూ అందుకోని..
చంద్రయాన్-2 ఇప్పటివరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపనుంది. చంద్రయాన్-1ను ప్రయోగించిన 11 ఏళ్ల తర్వాత.. ఇస్రో 2019 జులై 22న విజయవంతంగా చంద్రయాన్-2ను నింగికి పంపింది.
- ఇదీ చూడండి: దుబాయ్లో జాక్పాట్ కొట్టిన తెలుగోడు..!