ETV Bharat / bharat

చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చారిత్రక ప్రయోగం చంద్రయాన్​-2లో కీలక ఘట్టానికి సమయం దగ్గరపడుతోంది. జులై 22న శ్రీహరికోట నుంచి వ్యోమనౌక నిప్పులు కక్కుతూ జాబిల్లివైపు బయలుదేరింది. తర్వాత కీలక దశలన్నీ పూర్తి చేసుకుంది. ఇక ల్యాండర్​ విక్రమ్​ చంద్రుడి ఉపరితలంపై మృదువుగా దిగడమే ఆలస్యం. తర్వాత ఏంటి? చంద్రయాన్​-2 మిషన్​ దక్షిణ ధ్రువంపై కాలుమోపిన అనంతరం ఏం చేస్తుంది?

విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!
author img

By

Published : Sep 6, 2019, 1:30 PM IST

Updated : Sep 29, 2019, 3:32 PM IST

చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

చంద్రయాన్​-1కు కొనసాగింపుగా చంద్రయాన్​-2 ప్రయోగం చేపట్టింది ఇస్రో. తొలి ప్రాజెక్టు సాధించని ఎన్నో ఘనతల్ని... దీని ద్వారా సాధ్యం చేయాలనుకుంటోంది. నీటి జాడపై పూర్తి సమాచారం, జాబిల్లి పుట్టుక, ఆవాసానికి వీలుందా వంటి అంశాలపై లోతుగా విశ్లేషణ చేయనుంది.

చంద్రయాన్​-2 మాడ్యూల్​లో మూడు భాగాలుంటాయి. అవి... ఆర్బిటర్​, విక్రమ్(ల్యాండర్)​, ప్రగ్యాన్(రోవర్).

చంద్రయాన్​-2 ఆరంభ దశ...

శ్రీహరికోట నుంచి నింగికెగిసిన జీఎస్​ఎల్​వీ మార్క్‌-3 భూ కక్ష్యను చేరిన తర్వాత... అక్కడ చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను విడిచి పెట్టింది. అప్పటి నుంచి చంద్రయాన్‌-2 మాడ్యూల్లో ఉంచిన చిన్నచిన్న రాకెట్ల ద్వారా దాని కక్ష్యను దశలవారీగా పెంచారు.

కీలక దశ...

పలు కీలక దశలు పూర్తి చేసుకున్న అనంతరం.. కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్​ 7వ తేదీ తెల్లవారుజామున 1.30-2.30 గంటల మధ్య ల్యాండర్​ విక్రమ్​ చంద్రుడి ఉపరితలంపై సున్నితంగా దిగనుంది.

ఈ దశలో వేగాన్ని తగ్గించే రాకెట్లు మండుతాయి. చంద్రుడిపై వాతావరణం ఉండదు కాబట్టి.. కక్ష్య నుంచి శరవేగంతో దూసుకొచ్చే ల్యాండర్‌ను ఆపటానికి పారాషూట్లు ఉపయోగపడవు. అందుకే ఈ ప్రత్యేక రాకెట్లు. ఈ దశలో ల్యాండర్‌ తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెడుతుంది. ఉపరితలానికి చేరువయ్యాక... వేగాన్ని గంటకు 3.6 కిలోమీటర్ల కన్నా తక్కువకు తగ్గించుకుంటుంది. కొంతసేపు నిశ్చల స్థితిలో ఉంటూ అక్కడి నేలను స్కాన్‌ చేయటం మొదలు పెడుతుంది. ఎక్కడ దిగితే మంచిదో అన్వేషణ ఆరంభిస్తుంది. కెమెరాల సాయంతో కింద రాళ్లు రప్పల్లాంటి అవరోధాలేమీ లేకుండా, సూర్యకాంతి బాగుండే ప్రాంతాన్ని చూసుకుని దిగుతుంది.

డబుల్​ రోల్...

ల్యాండర్‌ క్షేమంగా చంద్రుడిపై కాలు మోపిన తర్వాత.. రోవర్‌ పని మొదలవుతుంది.

ల్యాండర్‌ నుంచి జారుడు బల్ల లాంటి ఒక ర్యాంప్‌ తెరుచుకుంటుంది. అందులో నుంచి 6 చక్రాల రోవర్‌ మెల్లగా కిందకు దిగుతుంది. అలా వస్తున్నప్పుడే దాని సౌర ఫలకం విచ్చుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా... ఓ 15 నిమిషాల్లో పూర్తవుతుంది. అక్కడి నుంచీ రోవర్‌ చంద్రుడిపై 14 రోజుల పాటు తిరుగాడుతూనే... రకరకాల సమాచార సేకరణలో నిమగ్నమవుతుంది.

చిన్నగా... చురుకుగా...

చంద్రుడిపై తిరిగే ప్రగ్యాన్‌ రోవర్‌.. కొంత ఇస్రో పంపే ఆదేశాలకు అనుగుణంగా, కొంత సొంత మేథస్సుతో పనిచేస్తుంది. ఇది బ్రీఫ్‌ కేస్‌ అంతే ఉంటుంది. చంద్రుడి నేలను దగ్గరగా పరిశీలించి, ఆ డేటా భూమికి పంపుతుంది.

కదలిక కోసం రోవర్​లో అల్యూమినియంతో తయారైన 6 ప్రత్యేక చక్రాలు అమర్చారు. ఏ దారిలో వెళ్లాలో తేల్చుకునేందుకు నేవిగేషన్‌ కెమెరా, ఇన్‌క్లైనోమీటర్‌ ఉన్నాయి. చంద్రుడి నేలలో కూరుకుపోకుండా నడిచేలా చక్రాలను విడివిడి మోటార్లతో రూపొందించారు. ఈ రోవర్‌ సెకనుకు 1-2 సెంటీమీటర్ల దూరమే ప్రయాణిస్తుంది. ఉపరితలాన్ని శోధించి, అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడుతుంది. ఇది 15 రకాల పరీక్షలు అక్కడికక్కడే చేస్తుంది.

ఇలా 3 విభిన్న దిశల్లో వేర్వేరు పనులు చేస్తుండే మూడింటినీ కలిపి ఏకకాలంలో ఒక వ్యోమనౌక ద్వారా ప్రయోగించడం వల్లే అత్యంత క్లిష్టంగా మారింది చంద్రయాన్​-2.

అతి తక్కువ ఖర్చుతో...

చంద్రయాన్​-1 వ్యయం రూ. 386 కోట్లు.. చంద్రయాన్​-2 కోసం రూ. 978 కోట్లు వెచ్చించింది ఇస్రో. చంద్రయాన్​-1 బరువు.. 1.38 టన్నులు. ఇప్పటి మిషన్​ బరువు 3.8 టన్నులు.

''భారత్​ ప్రయోగించే చంద్రయాన్​-2 ఖర్చు మొత్తం 150 మిలియన్​ డాలర్లు. మీరు గమనిస్తే... నాసా చివరిసారిగా చంద్రునిపైకి పంపిన మిషన్​ ఖర్చు దీని కంటే 10 రెట్లు ఎక్కువే. అత్యంత తక్కువ వ్యయంతో, ప్రభావవంతమైన యంత్రాలతో ప్రయోగాలు చేయడం భారత్​కు తెలుసు. భారత ఇంజినీర్లు, భారత శాస్త్రవేత్తలు, ఇస్రో సామర్థ్యంతోనే ఇది సాధ్యమైంది.'' ​

- పల్లవ బగ్లా, విజ్ఞాన శాస్త్ర నిపుణుడు

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 6 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0557: OBIT Mugabe 1 Part no access Zimbabwe; Part no access South Africa; Part no access Ethiopia 4228516
Archive of Zimbabwe ex-leader Mugabe who has died
AP-APTN-0540: Bahamas Dorian Recovery AP Clients Only 4228515
Grand Bahama residents struggle after Dorian
AP-APTN-0540: Archive Mugabe AP Clients Only 4228514
Longtime Zimbabwe leader Robert Mugabe dies at 95
AP-APTN-0536: Zimbabwe Mugabe Tweet AP Clients Only 4228513
Zimbabwe president confirms death of Mugabe
AP-APTN-0520: Japan Name Change AP Clients Only 4228512
Japan to change name order in English documents
AP-APTN-0447: Australia Opioids Addicted Son AP Clients Only 4228510
Australian mother battling son's opioid addiction
AP-APTN-0446: Peru Protest AP Clients Only 4228507
Thousands rally in support of early Peru elections
AP-APTN-0443: Indonesia Zarif AP Clients Only 4228505
Iran FM: Nuclear deal permits our moves
AP-APTN-0424: Mexico African Migrants AP Clients Only 4228508
African migrants stuck at Mexico's southern border
AP-APTN-0419: US CA Boat Fire NTSB Part must credit KEYT; No access Santa Barbara-San Luis Obisbo market; No use US broadcast networks; No re-sale, re-use or archive 4228506
Fire foiled rescue attempts by US dive boat crew
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.