ETV Bharat / bharat

'గ్యాంగ్​స్టర్లతో ఉగ్రదాడులకు పాక్​ ఐఎస్​ఐ పన్నాగం' - పాకిస్థాన్​ ఉగ్రదాడులు

భారత్​లో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్​ గూఢచర్య సంస్థ ఐఎస్​ఐ, పలు ఉగ్రసంస్థలు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. స్థానికంగా ఉండే కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్​స్టర్లతో భారత్​లో శాంతి భద్రతలకు భంగం కలుగజేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. పాక్ స్లీపర్​ సెల్స్​ను భారత భద్రతాదళాలు మట్టుబెడుతుండటం వల్ల ఈ వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించాయి.

ISI outsourcing terror strikes to crime gangs: Reports
'స్థానిక గ్యాంగ్​స్టర్లతో ఉగ్రదాడులకు పాక్​ ఐఎస్​ఐ పన్నాగం'
author img

By

Published : Aug 25, 2020, 8:49 AM IST

భారత నిఘావర్గాలు, భద్రతా దళాల అప్రమత్తతతో పాకిస్థాన్​ ఐఎస్​ఐ, ఉగ్రసంస్థల కుట్రలు బెడిసికొడుతున్నాయి. దేశంలో దాడులు నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే వాటి ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు. అందుకే భారత్​లో ఉగ్రదాడులు నిర్వహించేందుకు ఐఎస్​ఐ​ కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. స్థానికంగా ఉండే కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్​స్టర్ల సాయంతో దాడులు జరిపేందుకు కుట్రలు పన్నుతున్నట్లు పేర్కొన్నాయి.

ఉగ్రవాదులు, గ్యాంగ్​స్టర్లకు మధ్య సంబంధాల గురించి చండీగఢ్ నిఘా విభాగం దేశంలోని ఇతర అన్ని నిఘా సంస్థల యూనిట్లను అప్రమత్తం చేసింది. కొందరు గ్యాంగ్​స్టర్లను గుర్తించి వారి పేర్లను తెలియజేసింది. భారత్​లో దాడులు నిర్వహించాలని వీరికి పాక్​ ఐఎస్​ఐ టాస్క్​లు ఇస్తున్నట్లు వెల్లడించింది.

స్థానికంగా ప్రభావవంతమైన గ్యాంగ్​స్టర్లతో ఐఎస్ఐ ఇప్పటికే సంప్రదింపులు జరిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ సీనియర్​ అధికారి ఒకరు తెలిపారు.

కొందరు రాజకీయ నేతలే లక్ష్యంగా దాడులు జరపాలని స్థానిక గ్యాంగ్​స్టర్లను పాక్​ ఐఎస్ఐ, ఉగ్రసంస్థలు అడిగినట్లు పంజాబ్​లోని కేంద్ర నిఘా విభాగం కొద్ది రోజుల క్రితమే గుర్తించింది. వెంటనే ఆ ఐదుగురిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారు. మిగతా వారిని పంజాబ్​లోని వేర్వేరు జైళ్లలో ఉంచారు.

ఈ గ్యాంగ్​స్టర్లు అనేక హత్యలు, దోపిడీలు, నార్కొటిక్ కేసులలో నిందితులుగా ఉన్నారని, జైలు నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. వీరు జైళ్లలో ఉన్నా కూడా కదలికలు పసిగట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

భారత్​లో ఐఎస్​ఐకి వెన్నెముకలా ఉన్న స్లీపర్ సెల్స్​ను భద్రతా దళాలు దాదాపు మట్టుబెట్టాయి. ఐఎస్​ఐకి అనుకూలంగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

ఇదీ చూడండి: ఉగ్రమూకల అభయారణ్యం.. 'పాకిస్థాన్​' గడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.