ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని తిహార్ జైలుకు తరలించారు. దిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఆయనకు ఈనెల 19 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించడమే ఇందుకు కారణం.
చిదంబరం అవసరమైన మందులు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఆయనకు జెడ్ కేటగిరీ రక్షణ ఉన్నందున జైలులో ప్రత్యేక గదిలో ఉంచాలని ఆదేశించింది.
జైలులో చిదంబరానికి సరైన రక్షణ ఉంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. అయితే మనీలాండరింగ్ కేసులో చిదంబరం సరండర్ అవుతారంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కోర్టు ఈడీకి నోటీసు ఇచ్చింది.
కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గత నెల 21 నుంచి 15 రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు
- ఇదీ చూడండి: చిదంబరానికి ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఊరట