ETV Bharat / bharat

'చైనాతో యుద్ధంలో భారత్​ ఓడిపోయింది అందుకే' - రిపోర్టింగ్ ఇండియా బుక్

1965లో భారత్-పాకిస్థాన్ యుద్ధంతో కశ్మీర్​ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందే అవకాశాన్ని చేజార్చుకున్నామని ప్రముఖ పాత్రికేయులు ప్రేమ్ ప్రకాశ్ అన్నారు. 'రిపోర్టింగ్ ఇండియా' పేరుతో ఆయన రాసిన ఆత్మకథలో 70 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ జ్ఞాపకాలను పొందుపరిచారు. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్​ ఓటమికి కారణాలను వివరించారు.

Prem Prakash
ప్రేమ్ ప్రకాశ్
author img

By

Published : Nov 24, 2020, 12:22 PM IST

Updated : Nov 24, 2020, 12:53 PM IST

"కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు వచ్చిన సువర్ణావకాశం అది. 95వేల మంది పాకిస్థానీ యుద్ధఖైదీలు అప్పుడు మన స్వాధీనంలోనే ఉన్నారు. సిమ్లా ఒప్పందం మీద సంతకాలు చేసి ఆ అవకాశాన్ని జారవిడుచుకున్నాం" ప్రముఖ పాత్రికేయుడు ప్రేమ్ ప్రకాశ్ పేర్కొన్నమాటలివి. "రిపోర్టింగ్ ఇండియా: మై సెవెంటీ-ఇయర్ జర్నీ యాజ్ ఏ జర్నలిస్ట్" పుస్తకంలో తన 70 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ జీవిత జ్ఞాపకాలను పదిలం చేశారు ప్రకాష్‌.

1962 యుద్ధంలో దెబ్బతిన్న అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కేవలం 20 నెలల్లో భారత్ సైన్యాన్ని పునర్‌నిర్మించగలిగారని ప్రకాశ్ తెలిపారు. చైనాను ఎప్పటికీ విశ్వసించకూడదని ఈటీవీ భారత్ సీనియర్ రిపోర్టర్ గౌతమ్ దేవరాయ్‌కు ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు.

ప్రేమ్ ప్రకాశ్​తో ముఖాముఖి

ప్రశ్న: ఈ పుస్తకంలో మీరు ప్రస్తావించిన ముఖ్య విషయాలు చెబుతారా?

జవాబు: పాత్రికేయ జీవితంలో నేను రిపోర్టు చేసిన అంశాలను ఈ పుస్తకంలో పొందుపరచాను. బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలో నేను చిన్న కుర్రాడిని. ఆ విషయాన్ని కొంతమేర ప్రస్తావించాను. తర్వాత రాజకీయ వార్తల కవరేజీ. నాకు 31 ఏళ్లప్పుడు అక్రిడిటేషన్ ఇచ్చారు. అప్పట్లో అంతా సులభం.. 'ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జీవితంలో ఒక రోజు' కవర్ చేయడానికి నాకు అనుమతి లభించింది. ప్రధానమంత్రి నివాసంలో నా పేరు సుపరిచితం. ఇక్కడ నేను ఒక విషయం ఒప్పుకుని తీరాలి. నెహ్రూ నాకు ఎంతో సాయపడ్డారు. నిజంగా అదొక మధురమైన అనుభవం. అలాంటి ఇంటర్వ్యూలు ఎలా చేయాలి.. వాటిని ఎలా చిత్రీకరించాలి.. చాలా నేర్చుకోగలిగాను. ఆ తర్వాత నేను రకరకాల విషయాలపై రిపోర్ట్ చేయడం ప్రారంభించాను. నెహ్రూ పాలన, ప్రాజెక్టుల నిర్మాణం, చైనాతో సంబంధాలు, 1962 యుద్ధం, మరణం, శాస్త్రీజీ (లాల్ బహదూర్ శాస్త్రి) తాష్కెంట్‌కు వెళ్లడం, 1965 యుద్ధ విజయం- వాస్తవానికి ఆ యుద్ధ వార్తలు సేకరిస్తూ సైనికులతో కలసి ఒక శిఖరం ఎక్కాను. ఇలా ఎన్నో దాదాపు ప్రతి వార్తనూ నివేదించా. నరేంద్ర మోదీ కానివ్వండి డాక్టర్ మన్మోహన్ సింగ్ అవనివ్వండి.. నేను క్షేత్రస్థాయిలో లేకున్నా వారి గురించీ చాలా విషయాలు కవర్ చేశాను.

ప్ర: 1962 చైనా యుద్ధంలో భారత్ ఓటమి పాలవ్వడం పట్ల అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అపరాధభావనకు లోనయ్యారని మీ పుస్తకంలో ప్రస్తావించారు. ఆ విషయం గురించి..

జ: అలాంటిదేం లేదు. చైనాకు నెహ్రూ లొంగిపోలేదు, ఆయన అపరాధి కారు. అయితే సైన్యాన్ని ఆధునికీకరించలేదని బాధపడ్డారు. నెహ్రూతోపాటు రక్షణ మంత్రి కృష్ణ మేనన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలతో సమస్యలు పరిష్కారమయ్యే రోజులు పోయాయని భావించేవారు. అందుకే వారు భారత సైన్యాన్ని ఆధునికీకరించలేదు. మన సైనికలు రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఆయుధాలతోనే 1962లో చైనాతో పోరాడాల్సి వచ్చింది. వారిని దూరంగా పెట్టడానికి పండిట్‌జీ రాజకీయంగానే ప్రయత్నించారు.

మీరు చైనాను ఎప్పటికీ నమ్మకూడదని, వారు మన మీదకు దండెత్తి వచ్చారని నేను ఎప్పుడూ ఆయనకు చెబుతూనే ఉంటా. ఈశాన్య సరిహద్దు (ఎన్ఇఎఫ్ఏ- ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్) దాటి మన దేశంలోకి వచ్చారు. వాళ్లను ఎదుర్కోవడానికి మన దళాలను పంజాబ్ నుంచి, ఇతర మైదాన ప్రాంతాల నుంచి అప్పటికప్పుడు విమానాల్లో తరలించాల్సి వచ్చింది. చేలా పర్వతశ్రేణి మీదకు చేరుకుని కందకాలు తవ్వటం ప్రారంభించారు. అయితే అప్పటికే చైనీయులు మనకంటే ఎత్తు మీద ఉన్నారు. ఫలితం మనం అక్కడ ఓడిపోవాల్సి వచ్చింది.

మరొకటి కూడా గుర్తు చేసుకోవాలి.. కృష్ణమేనన్ రాజకీయం చేశారు. సైన్యంలోని సరఫరా విభాగానికి బాధ్యుడిని మేనన్​.. జనరల్ (బీఎమ్ కౌల్)గా నియమించారు. ఆయనకు ఎటువంటి పోరాట అనుభవం లేదు.

ప్ర: భారత విదేశాంగ విధానం అప్పుడూ, ఇప్పుడూ... తేడా ఏమిటంటారు?

జ: స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచీ స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని భారత్​ నిర్ణయించుకుంది. దృరదృష్టవశాత్తు స్వతంత్ర విధానం కాస్తా తర్వాత అలీన ఉద్యమంగా మారింది. సోవియట్ యూనియన్‌-యూఎస్ ప్రచ్ఛన్న యుద్ధంలో మనం నష్టపోయాం. మనం ఏదో ఒక పక్షంవైపు ఉండాల్సి ఉండేది. అయితే ఏ ఒక్క పక్షం మనల్ని చేర్చుకోడానికి ఇష్టపడలేదు. ఫలితంగా మనం దెబ్బతిన్నాం. ఏమైనప్పటికీ ప్రపంచం మారిపోయింది. తన సొంత ప్రయోజనాలు పరిరక్షించే విధానం ఒకటి భారత్​కు అవసరమైంది. అయితే 1962 యుద్ధ వైఫల్యం తరువాత నెహ్రూ 20 నెలల్లోనే భారత సైన్యాన్ని పునర్నిర్మించిన విషయం విస్మరించలేనిది. రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత కూడా ఆయన పని చేసుకుంటూనే ఉండటం నాకు తెలుసు. సైనిక పాటవంతో పాటు దేశరక్షణ విషయంలో ఆయన అపారంగా శ్రమించారు. ఫలితంగా 1967 లో నాథులా పాస్​ వద్ద చైనీయులు మనపై మరోసారి యుద్ధానికి తెగబడినప్పుడు విజయవంతంగా తిప్పికొట్టాం. చైనా దళాలను టిబెట్ లోపలికి 30 మైళ్ల వరకు తరుముకుంటూ వెళ్లాం. 400 మంది చైనా సైనికులను హతమార్చాం. అప్పటి భారత్ మిలిటరీ జనరల్ సగత్ సింగ్ ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి, చైనా తన సైనికుల మృత దేహాలను వెనక్కు తీసుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చారు.

ప్ర: బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత్ పాత్ర గురించి మీ రచనలో విస్తృతంగా ప్రస్తావించారు. ఆ విషయం ఏమైనా చెప్తారా?

జ: పాకిస్థాన్ తన సొంత ఎన్నికలను గుర్తించడానికి నిరాకరించిన ఫలితంగానే బంగ్లాదేశ్ సంక్షోభం ఊపిరి పోసుకుంది. తూర్పు పాకిస్థాన్‌లో షేక్ ముజిబర్ రెహమాన్ మెజారిటీ నాయకుడిగా ఎన్నికయ్యారు. భుట్టో (జుల్ఫికర్ అలీ భుట్టో), పాకిస్థాన్ సైన్యం ఆయన ప్రధాన మంత్రి అయ్యేందుకు సమ్మతించలేదు. అదే ఉద్యమానికి దారి తీసింది. షేక్ ముజిబర్ రహమాన్ ‘ఏబర్ సంగ్రామ్ ముక్తి సంగ్రామ్’ అంటూ నినదించారు. పాక్​ సైన్యం ఉద్యమకారులపై విరుచుకుపడింది. పది లక్షల మందికి పైగా శరణార్థులు భారత్​లో తలదాచుకునేందుకు కట్టుబట్టలతో తరలివచ్చారు. హిందువులే కాకుండా ముస్లిములు.. ముఖ్యంగా అవామీలీగ్ మద్దతుదారులు ఉన్నారు. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రజలు తిరిగి వెనక్కు వెళ్లిపోవాలని భారత్ నిర్ణయం తీసుకుంది. అలా వెళ్లేందుకు వారికి భారత్ సాయపడాలి. వారు స్వతంత్య్ర బంగ్లాదేశ్ సాధించుకోవాలి. ఆ రోజు వచ్చింది.. ముక్తి వాహిని పోరాటం మొదలైంది. భారత సైన్యం పదిహేను రోజుల్లో దానికి ముగింపు ఇచ్చింది.

ప్ర: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండానే సిమ్లా ఒడంబడిక కుదుర్చుకుని విమర్శలు ఎదుర్కొన్నారని మీ పుస్తకంలో పేర్కొన్నారు?

జ: ఒక విషయం గుర్తు చేసుకోండి. 95,000 మంది పాక్ సైనికులను మనం యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాం. ప్రపంచ యుద్ధం తరువాత ఇంత పెద్ద సంఖ్యలో ఇలా పట్టుపడటం అదే ప్రథమం. వారిని విడిపించవలసిందిగా పాకిస్థాన్​ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. భుట్టో తన కుమార్తెను వెంటబెట్టుకొని చర్చల కోసం సిమ్లా వచ్చారు. ఈ చర్చల్లో మనం పట్టవిడుపు లేకుండా విషయాన్ని తెగే వరకు లాగాం. కశ్మీర్ సరిహద్దు అంతటినీ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)గా పరిగణించటంతోపాటు మరి కొన్ని వాగ్దానాలను భుట్టో పదే పదే చేశారు. భారత్ మాత్రం కశ్మీర్ అంశం తేల్చాల్సిందేనని పట్టుబట్టింది. చివరి రోజున చర్చలు విఫలమయ్యాయనే నేను అనుకున్నాను. అంతలోనే అకస్మాత్తుగా మాకొక సమాచారం అందింది.. ఆ రాత్రి ఒప్పందం మీద సంతకాలు జరగబోతున్నాయని చెప్పారు. కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండానే సంతకాలు చేశారు. నిజానికి, కశ్మీర్​ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి మనకు లభించిన సువర్ణావకాశం అది. దాన్ని మనం చేజార్చుకున్నాం.

ఇదీ చూడండి: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దారేది?

Last Updated : Nov 24, 2020, 12:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.