ETV Bharat / bharat

నేపాలీయుల కోసం.. భారత్​లో ఆ బ్రిడ్జ్​ పునఃప్రారంభం - International Suspension Dharchula bridge

అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్​లోని ఓ ప్రముఖ బ్రిడ్జ్​ తాత్కాలికంగా పునఃప్రారంభమైంది. నేపాల్​ అభ్యర్థన మేరకు.. పింఛన్​దార్ల సౌకర్యార్థం ప్రతి నెలా ఈ సేవలు కల్పిస్తామని అక్కడి అధికారులు తెలిపారు.

International Suspension Bridge at Uttarakhand's Dharchula opens for Nepali nationals
నేపాలీయుల కోసం.. భారత్​లో ఆ బ్రిడ్జ్​ పునఃప్రారంభం
author img

By

Published : Oct 22, 2020, 1:11 PM IST

ఉత్తరాఖండ్​లో అంతర్జాతీయ నిషేధం విధించిన థార్చులా బ్రిడ్జ్​ను పునఃప్రారంభించింది ఆ రాష్ట్రం. పింఛన్​దార్ల సౌకర్యార్థం మూడురోజుల పాటు ఈ సేవలు కల్పిస్తున్నట్టు రాష్ట్ర సర్కార్​ తెలిపింది. ఫలితంగా గతంలో భారత సైన్యం, ఇతర విభాగాలలో పనిచేసిన పింఛన్​దార్లు.. బ్యాంకులు, తపాలా శాఖ ద్వారా తమ పెన్షన్​ సొమ్మును విత్​ డ్రా చేసుకునేందుకు వీలుగా రాకపోకలకు మార్గం సుగమమైంది.

నిర్ణీత కాలవ్యవధిలోనే..

రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్రిడ్జ్​ ద్వారా రాకపోకలకు అనుమతి కల్పించారు అధికారులు. ఈ మేరకు బుధవారం 239 మంది నేపాలీయులు దేశంలోకి వచ్చారు. అలాగే 151 మంది భారతీయులు హిమాలయ దేశానికి వెళ్లారు. అనంతరం.. 2 గంటల తర్వాత బ్రిడ్జ్​ను మూసివేసినట్టు స్థానిక తహసీల్దార్​ తెలిపారు.

ప్రతి నెలా..

ఇలా పింఛన్​ తీసుకునే వారి కోసం.. ప్రతి నెలా ఈ సదుపాయం కల్పిస్తామని థార్చులా డిప్యూటీ కలెక్టర్​ అనిల్​ కుమార్​ శుక్లా చెప్పారు. నేపాల్​ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: నౌకాదళంలో చేరిన 'ఐఎన్​ఎస్ కవరత్తి' యుద్ధనౌక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.