ETV Bharat / bharat

'కొవిడ్​ సంక్షోభం నుంచి త్వరలోనే విముక్తి' - రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కొవిడ్​ మహమ్మారి నుంచి త్వరలోనే విముక్తి లభిస్తుందని.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ కోసం వివిధ దేశాలు చేస్తున్న కృషిపట్ల హర్షం వ్యక్తం చేశారు.

International community will emerge stronger, more resilient from COVID crisis: Prez Kovind
'కొవిడ్​ సంక్షోభం నుంచి త్వరలోనే విముక్తి దొరుకుతుంది'
author img

By

Published : Nov 20, 2020, 5:18 PM IST

కరోనా మహమ్మారికి పరిష్కారం కనిపెట్టే దిశగా అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషి ఫలిస్తుందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి విముక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యం, మానవత్వం విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమనే విషయాన్ని కొవిడ్​ మహమ్మారి గుర్తు చేసిందని అన్నారు.

వివిధ దేశాల నుంచి భారత్​కు కొత్తగా రాయబారులుగా వచ్చిన వారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు రాష్ట్రపతి. హంగేరీ రాయబారి ఆండ్రాస్​, మాల్దీవుల హైకమిషనర్​ హుసేన్​ నయాజ్​, చాద్​ రాయబారి సౌంగుయ్​ అహ్మద్​, తజికిస్థాన్​ ప్రతినిధి లుక్మాన్ నుంచి క్రెడెన్షియల్స్ స్వీకరించారు. ఈ నాలుగు దేశాలతో భారత్ ఎల్లప్పుడూ సత్సంబంధాలను కొనసాగిస్తుందని కోవింద్ తెలిపారు. శాంతి, సౌభ్రాత్రం అంశాల్లో ఉమ్మడిగా కలిసి సాగుతుందని పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ ఉండేందుకు మద్దతు తెలిపినందుకు గాను.. కోవింద్​ ఆ దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చూడండి:రాష్ట్రపతి రచనలను ఆవిష్కరించిన రాజ్​నాథ్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.