ETV Bharat / bharat

'కరోనా కాలంలో మత వైరస్​ను వ్యాప్తి చేస్తున్న భాజపా'

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ వేదికగా భాజపాపై విరుచుకుపడ్డారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. దేశంలో మత విద్వేషాలను భాజపా రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఆ పార్టీ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు.

VIRUS-CWC-SONIA
సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
author img

By

Published : Apr 23, 2020, 12:37 PM IST

భాజపాపై కాంగ్రెస్ అధినేత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలో కొన్ని వర్గాలకు పక్షపాతంగా వ్యవహరిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక సామరస్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు సోనియా.

"ఈ విషయంలో ప్రతి భారతీయుడు చింతించాల్సిన అవసరం ఉంది. మనమంతా ఐకమత్యంగా కరోనా మహమ్మారి​పై పోరాడుతున్నాం. కానీ భాజపా మత పక్షపాత ధోరణి అవలంబిస్తూ విద్వేష వైరస్​ను వ్యాప్తి చేస్తోంది. దీని వల్ల కలిగే నష్టాన్ని పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేయాల్సిన అవసరం ఉంది."

- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు

మూడు వారాలుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని... నిర్ధరణ పరీక్షలను పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు సోనియా. కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​కు సంబంధించి సహకారం, తీసుకోవాల్సిన చర్యలపై చాలాసార్లు ప్రధానికి లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. వీటిని సరిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఆమె ప్రసంగంలోని మరిన్ని అంశాలు:

  • లాక్​డౌన్​ మొదటి దశలో 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అందువల్ల ఎంఎస్​ఎంఈ రంగానికి ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని విజ్ఞప్తి చేశాం.
  • వలస కూలీలు, నిరుద్యోగులకు ఆహారం, ఆర్థిక భద్రత కల్పించాలని కోరాం.
  • నిర్ధరణ పరీక్షలు, బాధితులను గుర్తించటం, క్వారంటైన్​ చేయటం మినహా వేరే మార్గం లేదని ప్రధానికి చెప్పాం. అయినా పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉంది. టెస్టింగ్ కిట్ల కొరత ఉంది.
  • మే 3 తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి ఎలాంటి అవగాహన ఉన్నట్లు లేదు. ఇలాగే కొనసాగితే ఇంతకు మించిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అప్పుడే విజయం..

కరోనాను ఎదుర్కోగలిగితేనే లాక్​డౌన్​ విజయవంతమవుతుందని ఈ సందర్భంగా మన్మోహన్​ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కీలకమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయకుండా కరోనాపై విజయం సాధించలేమని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు భూపేశ్ బఘేల్​, అశోక్​ గహ్లోత్ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రాలు కరోనాపై పట్టు సాధించలేవని అన్నారు.

ఇదీ చూడండి: 'మోహన్​లాల్​'కు మోదీ ఫోన్​- ఎలా ఉన్నావని ఆరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.