మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకు ఆర్థిక సాయంగా రూ.50వేలు ఇవ్వనుంది. చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది.
ముఖ్యమంత్రి పరిశీలన
ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. దర్యాప్తునకు ప్రత్యేక ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రమాదానికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ అధికారులు, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా భవంతి- ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్ను కలిపే ఈ వంతెనను 26/11 ముంబయి దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు వినియోగించారు. అందుకే ఈ వంతెనను 'కసబ్ వంతెన' అని పిలుస్తారు.
40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనను పరిశీలించాలని అధికారులను చాలా రోజుల నుంచే కోరుతున్నట్లు స్థానిక శివసేన కార్పొరేటర్ సూజతా సనాప్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధాని సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ముంబయిలోని అంధేరిలో సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. వంతెన కుప్పకూలిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.