ETV Bharat / bharat

'ఉగ్రకుట్రను ఆపేందుకే కశ్మీర్​కు బలగాలు' - అజిత్​ డోభాల్​

పాక్​ ఆధారిత ఉగ్రసంస్థలు జమ్ముకశ్మీర్​లో దాడులకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్నాయని కేంద్రప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అందుకే అదనపు భద్రతాబలగాలు మోహరించామని స్పష్టంచేశాయి.

ఉగ్రకుట్రను ఆపేందుకే కశ్మీర్​లో అదనపు బలగాలు
author img

By

Published : Jul 28, 2019, 12:57 PM IST

Updated : Jul 28, 2019, 9:43 PM IST

'ఉగ్రకుట్రను ఆపేందుకే కశ్మీర్​కు బలగాలు'

జమ్ముకశ్మీర్​లో దాడులు చేయడానికి పాక్​ ఆధారిత ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయన్న నిఘా సమాచారం మేరకే అదనపు భద్రతా బలగాలు మోహరించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ ఢోబాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి. 'ఆర్టికల్ 35 ఏ రద్దు' చేస్తారనే వదంతలు సహా జమ్ముకశ్మీర్​లోని వివిధ రాజకీయ పార్టీలు భద్రతా బలగాల మోహరింపుపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు​ ఈ ప్రకటన చేశాయి.

డోభాల్ పర్యటనతో.... రగడ మొదలు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​ మూడు రోజుల పర్యటనలో జమ్ముకశ్మీర్​లోని పోలీసులు, పారామిలటరీ, సైనికి, పౌర అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. నిఘా సంస్థలతోనూ సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యవసర ప్రణాళికను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.

భద్రతాదళాల మోహరింపు

అజిత్​ డోభాల్ పర్యటించి వచ్చాక.. జమ్ముకశ్మీర్​లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి భద్రతా సిబ్బందిని తరలించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 100 కంపెనీలను తక్షణం అక్కడకు పంపాలని ఆదేశించింది.

పటిష్ట బందోబస్తు

కేంద్రం ఆదేశం మేరకు జమ్ముకశ్మీర్​లోని విమానాశ్రయాలు, విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్​ గ్రిడ్లు నీటి సరఫరా, ఆసుపత్రులు, భద్రతా శిబిరాల వద్ద బలగాలను మోహరిస్తున్నారు. అల్లర్లను సృష్టించే అవకాశమున్న వారి పేర్లుతో జాబితా సిద్ధం చేస్తున్నారు. జాతి వ్యతిరేక శక్తులను ముందుగానే అదుపులోకి తీసుకునేందుకు అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కశ్మీర్​లో ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి భద్రతలను పటిష్టం చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆర్టికల్​ 35ఏ రద్దుకేనని విమర్శలు

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన నేషనల్​ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ, జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్​మెంట్లు ఆందోళన వ్యక్తం చేశాయి. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 35 ఏను కేంద్రం రద్దు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ఆరోపించాయి.

తప్పుపట్టిన మెహబూబా

జమ్ముకశ్మీర్​లో అదనపు బలగాల మోహరింపు నిర్ణయాన్ని మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. రాష్ట్రంలో ఉన్నది రాజకీయ సమస్య అని, దాన్ని సైనిక పద్ధతిలో పరిష్కరించుకోవాలనుకోవడం సరికాదన్నారు.

అదనపు బలగాల మోహరింపు నిర్ణయం జమ్ముకశ్మీర్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోందని పీపుల్స్ కాన్పరెన్స్ ఛైర్మన్​ సజాద్​ గనీ లోనీ పేర్కొన్నారు.

ఉగ్రచర్యలు అడ్డుకోవడానికే..

విపక్షాల ఆందోళనలపై స్పందించిన అజిత్​ డోభాల్... ఉగ్రచర్యలను అడ్డుకోవడానికి మాత్రమే అదనపు భద్రతా బలగాలను సరిహద్దుల్లో మోహరించామని పేర్కొన్నారు.

ఆర్టికల్ 35 ఏ అంటే..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 35 ఏ జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోంది. దీని ప్రకారం జమ్ముకశ్మీర్​లో శాశ్వత నివాసితుల హోదాను నిర్వచించే సంపూర్ణ అధికారం ఆ రాష్ట్రశాసన సభకు ఉంటుంది. ఆ రాష్ట్ర పౌరులకు ప్రత్యేక హక్కులు లభిస్తాయి. ఈ అధికరణం కింద రాష్ట్ర శాసనసభ తీసుకునే ఎలాంటి చర్యలనూ రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించడం కుదరదు.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: 14 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై వేటు

Intro:Body:

w

Conclusion:
Last Updated : Jul 28, 2019, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.