తమిళనాడులోని నీలగిరి జిల్లా మాసినగుడిలో ఓ గజరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దాని ఎడమ చెవి సగం చీలిపోయి.. తీవ్ర రక్తస్రావమవుతోంది. రక్తంతో సంచరిస్తున్న ఆ ఏనుగును గుర్తించిన అటవీ శాఖ అధికారులు చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆహారం ద్వార మందులు అందించినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిన తర్వాత మత్తు మందు ఇచ్చి తదుపరి చికిత్స అందిస్తామని చెప్పారు.
ఏనుగులకు జనావాసాల్లోకి వెళ్లే అలవాటుందని, అలా వెళ్లినప్పుడు ఎవరైనా దానిపై దాడి చేసి ఉండొచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. త్వరలోనే దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు.
ఇదే నీలగిరిలో రెండు నెలల క్రితం ఓ మగ ఏనుగుపై దాడి జరిగింది. దాని వీపుపై తీవ్ర గాయమైంది. నెల రోజుల తర్వాత కోలుకుంది.
ఇదీ చూడండి: కేరళలో మరో ఏనుగు మృతి.. కారణం అదేనా?