ETV Bharat / bharat

ఒక్క నిమిషంలో ఆకాశమంత చెట్టు ఎక్కొచ్చు!

కష్టాల సాగుబడిలో నిత్యం నలిగిపోతున్నా... రాత్రింబవళ్లు రక్తం.. నీరు చేస్తూ శ్రమించే తత్వం రైతన్నలది. పంటసాగులో వారి కష్టాలను తీర్చేందుకు నూతన ఆవిష్కరణలు సహాయపడుతున్నాయి . కర్ణాటకలోని మంగళూరు రైతు తయారు చేసిన ఓ యంత్రం పోక రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

author img

By

Published : Jun 18, 2019, 8:18 PM IST

ఒక్క నిమిషంలో ఆకాశమంత చెట్టు ఎక్కొచ్చు!
ఒక్క నిమిషంలో ఆకాశమంత చెట్టు ఎక్కొచ్చు!

అది కర్ణాటక మంగళూరులోని ఓ వ్యవసాయ క్షేత్రం. అక్కడ రైతులు, పిల్లలూ 100 అడుగుల ఎత్తున్న పోక చెట్లను అవలీలగా ఎక్కేస్తుంటారు. సాధారణంగా తాటి, కొబ్బరి, పోక చెట్లు ఎక్కడానికి సాంప్రదాయ పద్ధతుల్లో కనీసం 8 నిమిషాలు పడుతుంది. ఇక్కడ 30 క్షణాల నుంచి ఒక నిమిషంలోపే రైతులు చెట్లను ఎక్కుతుంటారు.

పోక చెక్క రైతులకు చెట్లెక్కి పంట దించేందుకు, కీటక నాశనులు చల్లడానికి మనుషులు కరవయ్యారు. ఈ విషయాన్ని సవాలుగా తీసుకొన్న 48 ఏళ్ల గణపతి అనే రైతు ఓ యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఈ సాధనంతో పోక చెట్లను క్షణాల్లో ఎక్కగలుగుతున్నారు రైతులు.

"ఎన్నో ఏళ్లుగా పోక రైతులు కష్టపడుతున్నారు. వారికి ఇంతకుమందు ఇలాంటి సదుపాయం లేదు. ఇది కచ్చితంగా వారికి ఒక వరం లాంటింది. సాధారణంగా నైలాన్ తాడు కట్టుకొని చెట్టు ఎక్కుతారు. అయితే యంత్రాల సాయం తీసుకొంటే మన శక్తిని వృథా కాకుండా చూసుకోవచ్చు. పని చేసే సమయంలో అపాయాలు తగ్గుతాయి. ఇది చాలా ఉపయోగకరం.​"
- గణపతి, యంత్ర రూపకర్త

గణపతి ఆవిష్కరించిన ఈ యంత్రానికి విశేష స్పందన లభిస్తోంది. చుట్టపక్కల రైతులు ఈ యంత్రాన్ని చూడటానికి, వినియోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

"ప్రస్తుత పరిస్థితుల్లో చెట్లు ఎక్కే వాళ్లు దొరకడం కష్టమైపోయింది. గణపతి తయారు చేసిన ఈ అరెకా మోటారు యంత్రం చాలా ఉపయోగకరం. ఈ యంత్రంతో చెట్టు పైకి ఎక్కడానికి, కీటకనాశనులు చల్లడానికి, పోక చెక్కలు సేకరించడానికి చాలా తక్కువ సమయం పడుతోంది."
- రాజారామ్​, రైతు

సామాజిక మాధ్యమాల్లో...

గణపతి ఈ మోటారు యంత్రంతో చెట్లు ఎక్కుతోన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఈ వీడియోలను షేర్​ చేస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రత్యేకతలు...

ఈ అరెకా మోటారు బైక్​లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

⦁ 100 అడుగుల చెట్టునైనా నిమిషం లోపులోనే ఎక్తేస్తుంది.

⦁ ఒక మనిషి సురక్షితంగా కూర్చొని పైకి ఎక్కి పని చేసుకొని రావొచ్చు.

⦁ 28 కేజీల బరువున్న మోటరు, 2 స్ట్రోక్​ గేర్​ బాక్స్​లు, ఓ హైడ్రాలిక్​ డ్రమ్​ డిస్క్​ బ్రేక్​, 2 చైన్లతో ఈ యంత్రం తయారు చేశారు.

⦁ ఈ యంత్రం సాయంతో చెట్టెక్కేవారి బరువు 80 కిలోల లోపే ఉండాలి.

⦁ 1 లీటరు పెట్రోల్​ సాయంతో 100 సార్లు చెట్టెక్కొచ్చు.

గణపతితో పాటు ఆయన పిల్లలూ ఈ యంత్రం సాయంతో పని చేస్తూ నాన్నకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. పోక చెక్క రైతులకు ఈ యంత్రం పెద్ద సాయమే చేస్తోంది.

Muzaffarpur (Bihar), Jun 18 (ANI): Death toll due to Acute Encephalitis Syndrome (AES) in Bihar's Muzaffarpur rose to 108 on Tuesday. As many as 89 children have died in Sri Krishna Medical College and Hospital, while 19 others lost their lives in Kejriwal Hospital. While speaking to ANI, Sunil Kumar Shahi, Superintendent at SKMCH said, "Chief Minister met the patients and their relatives. He was satisfied with the present medical treatment being provided and ordered us to release a bulletin daily at 3pm. He was pained by the fact that adequate facilities for treatment were not available here."AES is a viral disease, which causes mild flu-like symptoms such as high fever, and headache.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.