ETV Bharat / bharat

నితీశ్​ హయాంలో 60 కుంభకోణాలు: తేజస్వీ - బిహార్​ ఎన్నికలు 2020

బిహార్​లో ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ హయాంలో రూ.30వేల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్​. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అతిపెద్ద అంశంగా మారిందని పేర్కొన్నారు. ఉల్లి ధరలు రూ.50 పెరిగినప్పుడు మాట్లాడిన వారు.. రూ.100కు చేరుకున్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శించారు.

Tejashwi Yadav
ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్
author img

By

Published : Oct 26, 2020, 2:39 PM IST

బిహార్​ ఎన్నికల్లో నిరుద్యోగంతో పాటు ఉల్లగడ్డల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కూడా ప్రధాన అంశాలుగా మారినట్లు పేర్కొన్నారు రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) నాయకుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. సీఎం నితీశ్​ కుమార్​ నాయకత్వంలో రాష్ట్రంలో రూ.30వేల కోట్ల విలువైన 60 కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.

తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే హామీ తర్వాత.. ధరల పెరుగుదలను ప్రధాన అస్త్రంగా చేసుకున్నారు తేజస్వీ. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

" ద్రవ్యోల్బణం అనేది అతిపెద్ద అంశం. ప్రస్తుతం ఉల్లిపాయల ధర కిలోకి రూ.100కి చేరింది. ఉల్లి ధరలు రూ.50-60 మధ్య ఉన్నప్పుడు మాట్లాడిన వారు.. ఇప్పడు మౌనంగా ఉంటున్నారు. రాష్ట్రంలో క్షుద్బాధ, పేదరికం పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగింది. చిరు వ్యాపారాలు దెబ్బతిన్నాయి. జీడీపీ క్షీణిస్తోంది. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాం. రైతులు తీవ్రంగా నష్టపోయారు. బిహార్​ పేద రాష్ట్రంగా మారటం వల్ల ప్రజలు.. విద్య, ఉద్యోగాలు, వైద్య సహాయం కోసం వలస పోతున్నారు. "

- తేజస్వీ యాదవ్​, ఆర్​జేడీ నేత

నితీశ్​పై విమర్శలు..

రాష్ట్రంలో విపత్తుల సమయంలో ఖర్చు చేస్తున్న నిధులపై ఆడిట్​ జరగటం లేదని, అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు తేజస్వీ. లంచం లేకుండా ఏ పని జరగటం లేదన్నారు. ఆ సంప్రదాయాన్ని నితీశ్​ జీ రూపొందించారని విమర్శించారు.

ఇదీ చూడండి: ఆర్​జేడీ హామీలు: 10లక్షల ఉద్యోగాలు- రుణ మాఫీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.