అగ్ని ప్రమాదాన్ని గుర్తించే వ్యవస్థలో లోపం... 160 మంది ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ320 విమానం చెన్నై నుంచి కువైట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
రాత్రి 1.20కి చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరిన పావు గంటకే విమానంలోని ఫైర్ అలారం మోగింది. పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) కేంద్రాలన్నింటినీ అత్యవసర సందేశాలు పంపారు. సరుకు రవాణా విభాగంలో పొగలు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. విమానాన్ని చెన్నై తిరిగి తీసుకువచ్చి, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటివరకు ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
విమానాన్ని పరిశీలించిన నిపుణులు... ఎలాంటి అగ్నిప్రమాదం జరగలేదని నిర్ధరించారు. పొగను గుర్తించే వ్యవస్థలో లోపం కారణంగా అలారం పొరపాటున మోగిందని తేల్చారు. ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి పంపారు.
ఇదీ చూడండి:ఝార్ఖండ్ ఎన్నికలకు మోగిన నగారా- 5 దశల్లో పోలింగ్