దేశంలో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల వ్యవధిలో 1,211 కొత్త కేసులు నమోదుకాగా.. 31 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్‌లో మహారాష్ట్ర.. వైరస్‌కు కేంద్రబిందువుగా మారింది. 352 కొత్త కేసులతో మొత్తం 2వేల 334 కేసులు నమోదయ్యాయి. సోమవారం 11మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 160కి చేరింది.