ఈ ఏడాది దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. అందులో తొలిస్థానంలో మణిపుర్‌కు చెందిన నాంగ్పోక్షికమై ఠాణా నిలిచింది. తమిళనాడు సేలం జిల్లాలోని ఏడబ్ల్యూపీఎస్-సురమంగళం స్టేషన్ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది.
పోలీసుల పనితీరును మెరుగుపరచటం, స్టేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకొచ్చేందుకే ఈ మేరకు ర్యాంకులు కేటాయిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ.
టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితా..
ర్యాంక్ | రాష్ట్రం | జిల్లా | పీఎస్ |
1 | మణిపుర్ | తౌబల్ | నాంగ్పోక్షికమై |
2 | తమిళనాడు | సేలం | ఏడబ్ల్యూపీఎస్, సురమంగళం |
3 | అరుణాచల్‌ప్రదేశ్ | చాంగ్లాంగ్ | ఖర్సాంగ్ |
4 | ఛత్తీస్‌గఢ్ | సూరజ్‌పుర్ | ఝిల్మిలి (భాయా ఠాణా) |
5 | గోవా | దక్షిణ గోవా | సాంగుమ్ |
6 | అండమన్, నికోబర్ | ఉత్తర,మధ్య అండమన్ | కాలిఘట్ |
7 | సిక్కిం | తూర్పు జిల్లా | పక్యాంగ్ |
8 | ఉత్తర్‌ప్రదేశ్ | మొరదాబాద్ | కాంత్ |
9 | దాద్ర నగర్ హవేలీ | దాద్రా నగర్ హవేలీ | ఖాన్వెల్ |
10 | తెలంగాణ | కరీంనగర్ | జమ్మికుంట టౌన్ |
2015లో గుజరాత్‌లోని కచ్‌లో నిర్వహించి ఓ సభలో పోలీస్ స్టేషన్ల పనితీరును మదింపు చేసి ర్యాంకులు కేటాయించాలని ప్రధాని మోదీ సూచించిన మేరకు.. అప్పటి నుంచి ప్రతిఏటా టాప్-10 జాబితా విడుదల చేస్తోంది హోంశాఖ. ఈఏడాది కరోనా మహమ్మారి కారణంగా మారుమూల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు సర్వే నిర్వహించే అధికారులు. అయినప్పటికీ.. అన్ని నిబంధనలు పాటిస్తూ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
ఠాణాల వద్ద ఉన్న సమాచారం, ప్రజల అభిప్రాయాలు వంటివి పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 16,671 పోలీస్ స్టేషన్ల నుంచి టాప్-10ను ఎంపిక చేశారు. మరో 75 ఠాణాలను తదుపరి ర్యాంకింగ్ ప్రక్రియకు ఎంపిక చేశారు.
ఇదీ చూడండి: 'దివ్యాంగుల మెరుగైన జీవితం కోసం సమష్టిగా కృషి అవసరం'