ETV Bharat / bharat

చైనా తీరు మారే వరకు.. ఆ శిఖరాలపైనే పాగా!

సరిహద్దులో చైనాను ఒత్తిడికి గురి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తోంది భారత్​. ఈ మేరకు చైనా తన పద్ధతి మార్చుకునే వరకూ కీలకమైన పర్వత శిఖరాల నుంచి తన బలగాలను వెనక్కి తీసుకోరాదని భారత్‌ గట్టిగా భావిస్తోంది. మరోవైపు పరిస్థితులను అదుపు చేసేందుకు ఇరు దేశాలు కోర్​కమాండర్ల స్థాయిలో చర్చించుకున్నాయి. వీటి వల్ల కొన్ని సానుకూల పరిణామాలు నెలకొనే అవకాశం ఉందని భారత అధికార వర్గాలు తెలిపాయి.

India's strategies in border amid tensions with China
చైనా వెనక్కి తగ్గేంతవరకు.. ఆ శిఖరాలన్నీ మనవే!
author img

By

Published : Sep 25, 2020, 5:34 AM IST

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా తన పద్ధతి మార్చుకునే వరకూ కీలకమైన పర్వత శిఖరాల నుంచి తన బలగాలను వెనక్కి తీసుకోరాదని భారత్‌ గట్టిగా భావిస్తోంది. తద్వారా డ్రాగన్‌ సేనపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకుంది. మరోవైపు.. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో వెలువడిన ఉమ్మడి ప్రకటనలతో పరిస్థితి మరింత అదుపు తప్పకుండా.. స్థిరంగా ఉంటుందని ఆశిస్తోంది. ఇటీవల భారత్‌, చైనాల మధ్య విదేశాంగ మంత్రులు, కోర్‌ కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా రెండు ఉమ్మడి ప్రకటనలు వెలువడ్డాయి. పరిమిత స్థాయిలో బలగాల ఉపసంహరణ చేపట్టడం, ఎల్‌ఏసీ వెంబడి సుస్థిర పరిస్థితులు నెలకొనేలా చూడటం వీటి ఉద్దేశం. రెండు పక్షాల మధ్య తీవ్ర అపనమ్మకం నెలకొన్న నేపథ్యంలో ఇది చాలా అవసరంగా మారింది. అయితే బలగాల ఉపసంహరణ ప్రక్రియ అర్థవంతంగా సాగడమనేది చైనా నాయకత్వం ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుందని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల్లో ఇరు దేశాల సైన్యాల మధ్య భౌతిక దాడుల నివారణే ఉమ్మడి ప్రకటనల సారాంశమని వివరించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి దాడులు జరిగితే అవి తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చని పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోకి మరిన్ని బలగాలను పంపరాదన్నది సైనిక కోర్‌ కమాండర్ల చర్చలో తీసుకున్న కీలక నిర్ణయం. ఎల్‌ఏసీ వెంబడి పోటాపోటీగా జరుగుతున్న సైనిక మోహరింపులకు అడ్డుకట్ట వేయడం దీని ఉద్దేశం. ఎల్‌ఏసీ వెంబడి ఏప్రిల్‌ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని భారత్‌ డిమాండ్‌ చేస్తోంది. అయితే కొద్దివారాల కిందట పాంగాంగ్‌ సరస్సు దక్షిణ రేవులోని వ్యూహాత్మక పర్వతాలను భారత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడంతోపాటు ఉత్తర రేవుపై పట్టు బిగించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అయితే ఏప్రిల్‌కు ముందున్న పరిస్థితికి ఇది విరుద్ధంగా ఉంది. ప్రస్తుత వివాదానికి ముందు భారత బలగాలు పాంగాంగ్‌ సరస్సు ఉత్తర రేవులోని ఫింగర్‌-4 నుంచి ఫింగర్‌-8 మధ్య ఉన్న ప్రాంతాల్లో గస్తీ తిరిగేవి. అయితే వివాదం నేపథ్యంలో ఫింగర్‌-4 ప్రాంతంలో చైనా బలగాలు భారీగా మోహరించడంతో మన సైన్యం ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో.. దక్షిణ రేవులోని కీలక పర్వత ప్రాంతాలు మాత్రం భారత అధీనంలో లేవు. గత నెల 29-30 తేదీల్లో మన సైన్యం వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఫలితంగా చైనాతో పోలిస్తే మనకు వ్యూహాత్మక ఆధిపత్యం లభించినట్లయింది. ఏప్రిల్‌ నాటి స్థితిని పునరుద్ధరించాలంటే భారత సైన్యం కూడా ఈ కొండల నుంచి వెనక్కి మళ్లాలి. అయితే చైనా తన బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు గట్టి ఆధారాలు లభిస్తే తప్పించి, అక్కడి నుంచి వైదొలగరాదని భారత్‌ దృఢ నిశ్చయంతో ఉంది.

సుస్థిరతకు వీలు..

కోర్‌ కమాండర్ల చర్చల వల్ల కొన్ని సానుకూల పరిణామాలు నెలకొనే అవకాశం ఉందని భారత అధికార వర్గాలు తెలిపాయి. ‘‘బలగాల ఉపసంహరణపై ఒప్పందం కుదిరే వరకూ పరిస్థితిని స్థిరంగా ఉంచేందుకు ఇది తోడ్పడుతుంది’’ అని వివరించాయి. ప్రస్తుతం రెండు దేశాల బలగాలు ప్రమాదకరమైన స్థాయిలో దగ్గరగా ఉన్నాయి. సైన్యాల మధ్య దూరాన్ని పెంచేందుకు చర్యలు అవసరం. మరోవైపు చైనా విదేశాంగ శాఖ సంతకాలు చేసిన ప్రకటనలకు ఆ దేశ రాజకీయ అగ్రనాయకత్వ ఆమోదం ఉందా అన్నదానిపై అస్పష్టత నెలకొని ఉంది. చైనా ప్రకటనలు, చర్యలకు మధ్య వైరుధ్యం ఉండటం.. ఒక కుట్రా లేక చైనా రాజకీయ వ్యవస్థల నెలకొన్న భిన్నాభిప్రాయాలకు నిదర్శనమా అన్నది స్పష్టం కావడంలేదు. ఈ నేపథ్యంలో భారత్‌ తన అప్రమత్తతను కొనసాగిస్తోంది.

ఇదీ చూడండి:- 'డోక్లామ్‌' తర్వాత చైనా స్థావరాలు రెట్టింపు!

క్షేత్రస్థాయిలో సుస్థిరత ఉండాలి: భారత్‌

తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణకు కసరత్తు జరిగేలోగా క్షేత్రస్థాయి పరిస్థితులు సుస్థిరత నెలకొనేలా చూడాల్సిన అవసరం ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. సైన్యాలను వెనక్కి తీసుకోవడమనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, ఇందుకు పరస్పర ఆమోదంతో చర్యలు ఉండాలని తెలిపారు. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలకు దిగకుండా ఉండటమే ప్రస్తుతమున్న ఉత్తమ మార్గమని చెప్పారు. భారత, చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు, సమన్వయ కార్యాచరణ యంత్రాంగం (డబ్ల్యూఎంసీసీ) ఆద్వర్యంలో తదుపరి సమావేశం త్వరలోనే జరుగుతుందని తెలిపారు. సీనియర్‌ కమాండర్ల స్థాయి చర్చలు కూడా వెంటనే జరుగుతాయని చెప్పారు. కోర్‌ కమాండర్ల చర్చల తర్వాత తొలిసారిగా ఇరు పక్షాలూ.. ఉద్రిక్తతలను తగ్గించడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు పక్షాలూ నిర్ణయించినట్లు శ్రీవాస్తవ తెలిపారు. మరోవైపు భారత్‌, చైనాలు అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌ పేర్కొన్నారు. ఎదుగుతున్న క్రమంలో రెండు దేశాలు పరస్పరం ఎలా సర్దుబాటు చేసుకుంటాయన్నదే కీలకమని చెప్పారు. ప్రస్తుత సరిహద్దు వివాదం కూడా అందులో ఒక భాగమేనని తెలిపారు. గురువారం ఆయన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వర్చువల్‌ సదస్సులో మాట్లాడారు. వివాదాన్ని రెండు దేశాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

సానుకూల పరిణామాలు..

కోర్‌ కమాండర్ల చర్చల వల్ల కొన్ని సానుకూల పరిణామాలు నెలకొనే అవకాశం ఉందని భారత అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రెండు దేశాల సైన్యాల మధ్య దూరాన్ని పెంచేందుకు చర్యలు అవసరం. మరోవైపు చైనా విదేశాంగ శాఖ సంతకాలు చేసిన ప్రకటనలకు ఆ దేశ రాజకీయ అగ్రనాయకత్వ ఆమోదం ఉందా అన్నదానిపై అస్పష్టత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ తన అప్రమత్తతను కొనసాగిస్తోంది.

ఇదీ చూడండి:- చైనాలో మైనారిటీల అణచివేతకు 380 నిర్బంధ కేంద్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.