ETV Bharat / bharat

దేశంలో యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్నవారే అధికం - corona virus news in india

దేశంలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారత్​లో సగటున ప్రతి 10 లక్షల మందిలో 186.3 క్రియాశీల కేసులు ఉండగా.. 315.8 మంది కోలుకున్నారని వెల్లడించింది.

VIRUS-RECOVERY-RATE
రికవరీ రేటు
author img

By

Published : Jul 8, 2020, 5:25 AM IST

దేశంలో కరోనా క్రియాశీల కేసులతో పోలిస్తే రికవరీ రేటు అధికంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రతి 10 లక్షల మందిలో 315.8 మంది కోలుకోగా.. 186.3 మంది కరోనాతో బాధపడుతున్నట్లు నివేదించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య చూసుకుంటే భారీగానే నమోదైనా.. కోలుకున్నవారి సంఖ్య అధికంగా ఉండటం సానుకూలాంశమని వివరించింది కేంద్రం. ఫలితంగా దేశంలో ఆరోగ్య సదుపాయాలపై ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు త్వరితగతిన స్పందించి తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని తెలిపింది.

వివిధ రాష్ట్రాలవారీగా రికవరీ రేటు ఇలా ..

రాష్ట్రం

రికవరీ

(10 లక్షల మందిలో)

క్రియాశీల కేసులు

(10 లక్షల మందిలో)

దిల్లీ 3497.1 1242.9
మహారాష్ట్ర 869.5 661.6
తమిళనాడు 753 529.8
హరియాణా 480.9 140.4
గుజరాత్ 358.3 115.7
రాజస్థాన్ 217.1 52.7
మధ్యప్రదేశ్144.6 38.6
ఒడిశా 141.1 65.3
ఉత్తర్​ప్రదేశ్ 85.1 38.8

దేశంలో కరోనా కేసుల నిర్ధరణలో వేగం పెంచేందుకు ఆర్​టీ-పీసీఆర్​తోపాటు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను కేంద్ర ఆరోగ్య శాఖ (ఎంహెచ్​ఏ) అందుబాటులోకి తెచ్చింది. వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసింది.

ఫలితంగా కరోనా బాధితులకు సరైన చికిత్స లభించటం వల్ల దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని ఎంహెచ్​ఏ తెలిపింది.

ఇదీ చూడండి: 'కరోనా కేసులు, మరణాల రేటు భారత్​లో అత్యల్పం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.