ETV Bharat / bharat

"నిలువరించే సత్తా మన​కుంది"

ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిని నిలువరించ గల సత్తా ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అభిప్రాయపడ్డారు. గురుగ్రామ్​లో సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డోభాల్​.

"నిలువరించే సత్తా ఉంది"
author img

By

Published : Mar 19, 2019, 3:01 PM IST

Updated : Mar 19, 2019, 8:55 PM IST

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపగల సత్తా ప్రస్తుత ప్రభుత్వానికి ఉందన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​. గురుగ్రామ్​లో సీఆర్​పీఎఫ్​ 80వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు డోభాల్. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలను దేశం మరచిపోదన్నారు.

గతాన్ని తలచుకొని బాధపడకుండా వృత్తిధర్మాన్ని పెంపొందించుకుని శారీరక, మానసిక దృఢత్వంతో ముందుకు సాగాలని సీఆర్​పీఎఫ్​ జవాన్లకు సూచించారు.
అంతర్గత భద్రతా వ్యవస్థకు ముప్పు వాటిల్లినప్పుడు రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం, ప్రభుత్వం కూలిపోవడం వంటి ఘటనలు చరిత్రలో చాలా జరిగాయని డోభాల్ గుర్తుచేశారు.

అతిపెద్ద అంతర్గత భద్రతా వ్యవస్థగా ఉన్న సీఆర్​పీఎఫ్​ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు.

1939లో ఏర్పడిన సీఆర్​పీఎఫ్ ప్రస్తుతం మూడు లక్షలకు పైగా సిబ్బందితో అతిపెద్ద అంతర్గత భద్రతా వ్యవస్థగా అవతరించింది. 1950లో దేశ తొలి హోంమంత్రి సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​ హయాంలో సీఆర్​పీఎఫ్​కు అధికారిక గుర్తింపు లభించింది.

పుల్వామా దాడికి పాక్​పై ప్రతీకార చర్యగా భారత్​ నిర్వహించిన వాయుసేన మెరుపు దాడుల వ్యూహరచనలో డోభాల్ కీలక పాత్ర పోషించారు.

సీఆర్​పీఎఎఫ్​ 80వ వార్షికోత్సవంలో మాట్లాడుతున్న డోభాల్​

"మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటి..?మన లక్ష్యమేంటి? ఏ విధంగా ముందుకు సాగాలి.. ఏ సయమంలో ప్రతిఘటించాలి.. వీటిపై సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సత్తా ప్రస్తుత నాయకత్వానికి ఉంది. మీ మనోబలం దృఢంగా ఉంటే దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మీ వృత్తిధర్మానికి నేను నమస్కరిస్తున్నా.. "
-అజిత్​ డోభాల్​, జాతీయ భద్రతా సలహాదారు.

Intro:Body:

manohar

Conclusion:
Last Updated : Mar 19, 2019, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.