కార్మికుల ఉద్యమానికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఓ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది కేరళ ప్రభుత్వం. అలప్పుజలోని హౌస్‌బోట్ పర్యటక కేంద్రంలో ప్రారంభమయ్యే ఈ మ్యూజియంలో.. ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలూ ప్రదర్శితమవుతాయని పర్యాటక శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేసే అంశాలను భారీ స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది.
దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమయ్యే ఈ పురావస్తు ప్రదర్శన శాలలో.. కొచ్చి ఓడరేవు, కోయిర్(కొబ్బిరి తోటల ఉత్పత్తి) గొప్పదనం, కార్మిక పోరాటానికి సంబంధించిన అంశాలన్నీ భాగమవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి.. 100 రోజులైన సందర్భంగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.9.95 కోట్ల రూపాయలు వెచ్చించగా.. ఇప్పటికే 97శాతం పునరుద్ధరణ పనులు పూర్తయినట్టు సమాచారం. ప్రముఖ ఆర్కిటెక్ట్ డాక్టర్ బెన్నీ కురియాకోస్ ఈ మ్యూజియం ప్రాజెక్ట్ పనులకు నాయకత్వం వహిస్తున్నారు.
బాంబే కంపెనీ గతంలో నడుపుతోన్న 'న్యూ మోడల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ'నే.. కార్మిక ఉద్యమ మ్యూజియంగా మార్చారు అధికారులు. పాశ్చాత్య వలసవాదం రాకముందే.. అలప్పుజకు ప్రకృతి సౌందర్యాలు, పురాతన చరిత్ర పరంగా మంచి పేరుంది. ఇక్కడి కోయిర్(కొబ్బరి)కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటం విశేషం.
ఇదీ చదవండి: ఏకాంత చిత్రాలు.. వీడియోలతో భర్త వేధింపులు