భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 65,002 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 996 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.
![India's COVID-19 tally crosses 25 lakh with 65,002 cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8426426_ind.jpeg)
దేశంలో ఇప్పటివరకు 25 లక్షల 26 వేల 193 మందికి కరోనా సోకింది. 6 లక్షల 68 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 49 వేల 036కు చేరింది.
అయితే అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికి రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉంది. మరణాల రేటు అంతకంతకూ క్షీణించడం ఊరట కలిగించే విషయం.
ఇదీ చూడండి: ఆరోగ్య భారతం: ప్రతి పౌరుడికీ హెల్త్ ఐడీ జారీ