దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య (రికవరీ రేటు) మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 38,59,399 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారని తెలిపింది. రికవరీ రేటు 78.28 గా ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే 60.35 శాతం యాక్టివ్ కేసులు ఉండగా.. 60 శాతం మంది కోలుకున్నారు.
రాష్ట్రాల వారీగా కేసులు..
- మహారాష్ట్రలో తాజాగా 20,482 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 515 మంది మరణించగా.. 19,423 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలోమొత్తం 10,97,856 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 2,91,797 మంది చికిత్స పొందుతున్నారు.
- కర్ణాటకలో తాజాగా 7,576 కేసులు వెలుగు చూశాయి.. మరో 97 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4,75,265 మంది బాధితులు ఉండగా.. అందులో 3,69,229 మంది కోలుకున్నారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 6,895 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3,24,036కు చేరింది. రికార్డు స్థాయిలో 113 మంది మరణించగా... మొత్తం 4,604 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో తాజాగా 4,263 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.25 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. మరో 36 మంది మృతి చెందగా...ఇప్పటివరకు 4,806 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1,91,203 మంది కోలుకున్నారు.
- ఒడిశాలో తాజాగా 3,645 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. రాష్ట్రంలో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 645కు చేరింది. అలాగే మొత్తం బాధితుల సంఖ్య 1.58 లక్షలు దాటింది.
- కేరళలో కొత్తగా 3,215 కేసులు వెలుగు చూశాయి. మరో 12 మంది మృతి చెందగా... 2,532 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 31,156 యాక్టివ్ కేసులు ఉన్నాయి..
- రాజస్థాన్‌లో మరో 799 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,937కు చేరింది.
- జమ్ముకశ్మీర్‌లో మరో 1,329 కేసులు బయటపడ్డాయి. వీటిలో 741 జమ్మూలో, 588 కశ్మీర్లో గుర్తించారు.
- మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు పాజిటివ్‌గా తేలగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. ఇవాళ తుదిశ్వాస విడిచారు.