కరోనాను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయంటోంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ కారణంగానే మరణాల రేటు 2.28 శాతానికి తగ్గిందని.. దీంతో భారత్.. కరోనా మరణాల రేటు తక్కువగా ఉన్న దేశాల జాబితాలో ముందుందని స్పష్టం చేసింది. అంతే కాదు, దేశంలో కరోనాను జయిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని.. ఇప్పటికే 9 లక్షల మందికి పైగా కరోనాను జయించారని వెల్లడించింది.
"సంపూర్ణ సంరక్షణ విధానాల ద్వారా సమర్థమైన నియంత్రణ వ్యూహం, వేగవంతమైన పరీక్షలు, ఆరోగ్య ప్రామాణికాలతో కరోనా మరణాల రేటు గణనీయంగా తగ్గింది."
-ఆరోగ్య మంత్రిత్వ శాఖ
దేశంలో యాక్టివ్ కేసులు తగ్గి, రికవరీ కేసులు పెరుగుతున్నాయని తెలిపింది మంత్రిత్వ శాఖ. రోజుకు దాదాపు 30 వేల మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని వెల్లడించింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 14,35,453 కొవిడ్ కేసులు నమోదు కాగా.. వారిలో 9,17,567 మంది కోలుకున్నారు. 32,771 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: టైటానిక్ ప్రేమికులు పెట్టుకున్నారు మాస్కులు!