ETV Bharat / bharat

దేశంలో తగ్గిన మరణాలు.. పెరిగిన రికవరీలు - వైరస్​ మరణాల రేటు

భారత్​లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో సుమారు 34 వేల మంది డిశ్చార్జ్​ కాగా.. మొత్తంగా రికవరీ రేటు 63.45 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు కూడా 2.38 శాతానికి తగ్గిందని పేర్కొంది.

India's COVID-19 case fatality rate drops to 2.38 pc; recovery rate rises to 63.34 pc
దేశంలో తగ్గిన మరణాల రేటు.. పెరిగన రికవరీలు
author img

By

Published : Jul 24, 2020, 9:04 PM IST

దేశంలో వరుసగా మూడోరోజూ రికార్డు స్థాయిలో కరోనా రికవరీల సంఖ్య పెరిగింది. దేశ వ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలోనే 34,602 మంది బాధితులు.. వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా రికవరీ రేటు 63.45 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా మరణాల రేటు కూడా 2.38 శాతనికి తగ్గిందని తెలిపింది.

COVID-19 recovery rate rises to 63.34 pc
కొవిడ్​-19 రికవరీ రేటు

శుక్రవారం నాటికి సుమారు 8 లక్షల 20 మంది మహమ్మారి నుంచి బయటపడగా.. మరో 4 లక్షల 40 వేల మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. నిత్యం పెరుగుతోన్న రికవరీ రేటు ఆధారంగా.. యాక్టివ్​ కేసుల కంటే కోలుకున్నవారే సుమారు 3 లక్షల 80 వేల మంది అధికంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Covid-19 Recovery and Active cases
రికవరీ కేసులు & యాక్టివ్​ కేసుల వివరాలు

1290 ప్రయోగశాలల్లో..

Corona Testing labs
కరోనా ప్రయోగశాలలు

కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం.. అందుకు అనుగుణంగానే టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290(897 ప్రభుత్వ, 393 ప్రైవేట్​) ప్రయోగశాలల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ టెస్ట్​ చేయగా.. మొత్తంగా 1,54,28,170 నమూనాలను పరీక్షించారు.

India Corona cases as on Friday
శుక్రవారం నాటికి ఆయా రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు

ఇదీ చదవండి: తమిళనాడు, కర్ణాటకలో కోరలు చాస్తోన్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.