ETV Bharat / bharat

అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ సంస్థలకు ప్రోత్సాహం - భారత అంతరిక్ష రంగం

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందు కోసం ఇన్​ స్పేస్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ఇస్రో మాత్రం ఎప్పటిలాగే తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.

Indian space sector promotes private companies
అంతరిక్ష రంగంలో.. ప్రైవేట్‌ సంస్థలకు ప్రోత్సాహం
author img

By

Published : Jun 25, 2020, 4:24 AM IST

ఆత్మ నిర్భర్‌ భారత్ అభియాన్​లో భాగంగా భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌, ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌-స్పేస్‌) అన్న కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. త్వరలోనే ఈ సంస్థ రూపురేఖలు ఖరారు చేస్తామని కేంద్ర అణు ఇంధన, అంతరిక్ష వ్యవహారాలశాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు. అంతరిక్షాన్ని ఉపయోగించుకునేందుకు ప్రైవేట్‌ సంస్థలకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఇస్రో సేవలు

అంతరిక్ష సంస్థ అయిన ఇస్రో ఎప్పటిలాగానే కార్యకలాపాలు కొనసాగిస్తుందని, కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) కూడా మరికొన్ని పనులు చేపడుతుందని జితేందర్ సింగ్ వివరించారు.

ఇదీ చూడండి: మీ తెగువకు సలాం.. ఐదుగురు సైనికులకు ప్రశంసాపత్రాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.