ETV Bharat / bharat

'కరోనా వ్యాప్తి నియంత్రణలో ఎన్​95 భేష్!'

author img

By

Published : Aug 26, 2020, 5:54 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో ఎన్​95 మాస్కులు అత్యంత ప్రభావవంతంగా పనిచేసే అవకాశం ఉందని భారతీయ పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇస్రో శాస్త్రవేత్త కూడా పాల్గొన్నారు.

n95
ఎన్​95

కరోనా వంటి వైరస్ వ్యాధులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే నీటి బిందువుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. మాస్కు వినియోగంతో వీటి నుంచి రక్షించుకోవచ్చని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోనూ ఎన్​95 మాస్కులు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తిపై ఇస్రోకు చెందిన పద్మనాభ ప్రసన్న సింహ, కర్ణాటకలోని ఇనిస్టిట్యూట్​ ఆఫ్ కార్డియోవస్క్యూలర్ సైన్సెస్​కు చెందిన శ్రీ జయదేవ పరిశోధన చేశారు. ఈ అధ్యయనం ఫిజిక్స్​ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనే జర్నల్​లో ప్రచురితమయ్యాయి.

10 రెట్లు తగ్గించగలదు..

దగ్గినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్లపై వివిధ రకాలుగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. సమాంతరంగా వచ్చే బిందువులను అడ్డుకోవటంలో ఎన్​95 సమర్థంగా పనిచేసినట్లు గుర్తించారు. తుంపర్ల వేగాన్ని 10 రెట్లు తగ్గించటం సహా వ్యాప్తిని 0.1- 0.25 మీటర్లకు పరిమితం చేస్తాయని స్పష్టం చేశారు. అదే సాధారణ మాస్కు పరిధి 0.5- 1.5 మీటర్లు ఉంటుందనని తెలిపారు.

అయితే ఎన్​95 వంటి మాస్కులు అందుబాటులో లేనప్పుడు ఏదో ఒకటి ఉపయోగించటం మేలు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా దగ్గినప్పుడు మోచేయిని అడ్డుకోవాలని సూచిస్తున్నారు. వీటితోపాటు భౌతికదూరం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రక్తం రకరకాలుగా ఎందుకుంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.