ETV Bharat / bharat

హుబ్లీలో ప్రపంచంలోనే పొడవైన ప్లాట్​ఫార్మ్​! - హూబ్లీ స్టేషన్ ప్రపంచ రికార్డు

ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్​ఫార్మ్ ఉన్నస్టేషన్లు నిర్మించడంలో భారతీయ రైల్వే తన రికార్డు తానే బద్దలు కొట్టనుంది. ప్రస్తుతం ప్రపంచంలో పొడవైన ప్లాట్​ఫార్మ్ ఉన్నస్టేషన్​గా రికార్డు నెలకొల్పిన గోరఖ్​పూర్ స్టేషన్ స్థానంలో కర్ణాటకలోని హూబ్లీ రానుంది. దీని పొడవు 1,505 మీటర్లు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో దీనిని ప్రారంభించనున్నారు.

Indian Railways to build world's longest railway platform at Hubli
హూబ్లీ స్టేషన్​.. ప్రపంచ రికార్డు..
author img

By

Published : Dec 22, 2020, 1:24 PM IST

ప్రపంచంలో అత్యంత పొడవైన ప్లాట్​ఫార్మ్ ఉన్న రైల్వే స్టేషన్​గా కర్ణాటకలోని హూబ్లీ స్టేషన్ రికార్డులకు ఎక్కనుంది. 1505 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్న ప్లాట్​ఫార్మ్​ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన 'స్పిట్​ నాట్​ ఒకే' కార్యక్రమంలో పాల్గొన్న జోషి ఈ వివరాలను వెల్లడించారు.

Indian Railways to build world's longest railway platform at Hubli
'స్పిట్​ నాట్​ ఒకే' కార్యక్రమంలో ప్రహ్లాద్ జోషి

అప్పుడు 550.. ఇప్పుడు 1505..

హుబ్లీ స్టేషన్ ప్లాట్​ఫార్మ్​ పొడవు ఒకప్పుడు 550 మీటర్లు మాత్రమే. ప్లాట్​ఫార్మ్​ పొడగింపును మొదట 1400 మీటర్లకు అనుకున్నా, 1505 మీటర్లకు నిర్మించాలని సౌత్​ వెస్ట్రన్ రైల్వే నిర్ణయించింది. 90 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పొడవైన ప్లాట్​ఫార్మ్​ రికార్డు ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పూర్ స్టేషన్(1366 మీటర్లు) పేరున ఉంది. ​ ​

ఇదీ చూడండి : వృద్ధ రైతు సైకిల్ యాత్ర- 24 గంటల్లో 250 కి.మీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.