ETV Bharat / bharat

మోదీ విమానాన్ని మిసైల్స్​ కూడా ఢీకొట్టలేవా..? - Prime Minister's plane

భారత్​... ఆర్థికంగా, రాజకీయంగా శక్తిమంతంగా మారుతోన్న దేశం. ప్రపంచస్థాయిలో ఇండియా పేరు మారుమోగుతోంది. చైనా, అమెరికా వంటి బలమైన దేశాలతో అన్ని రంగాల్లో పోటీపడుతోంది. మరి అలాంటి సామ్రాజ్యాన్ని ముందుండి నడిపించే నాయకుడికి సరైన భద్రత లేకపోతే కష్టం కదా. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకమైన, ఖరీదైన విమానాన్ని సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అదే బోయింగ్​ 777. దాని విశేషాలను ఓసారి పరిశీలిద్దాం.

modi boeing
ప్రధాని మోదీ విమానాన్ని మిసైల్స్​ కూడా ఢీకొట్టలేవా..?
author img

By

Published : Jun 27, 2020, 12:01 PM IST

అమెరికా అధ్యక్షుడు ఏదైనా దేశంలో అడుగుపెడుతున్నారంటే అబ్బో ఆ హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఆయనకు ఇచ్చే భద్రత ఓ రేంజ్​లో ఉంటుంది. లిమోజిన్​ బీస్ట్​ కారు, ఎయిర్​ఫోర్స్​ వన్​ విమానం, మెరైన్​ వన్​ హెలికాప్టర్​ ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు. మరి అదే తరహాలో భారత ప్రధానికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఇప్పటివరకు ప్రయాణిస్తున్న ఎయిర్​ ఇండియా బోయింగ్​ 747 విమానం స్థానంలో అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక హంగులతో రూపొందిన 'బోయింగ్​ 777-300 ఈఆర్​' విమానాలను రెండింటిని కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఇవి ఈ ఏడాది జులై నాటికి అందుబాటులోకి రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఆగస్టు లేదా సెప్టెంబర్​లో భారత్​లో అడుగుపెట్టనున్నాయి. ఈ విమానాలపై భారత్​, ఇండియా అనే పేర్లతో పాటు.. భారత జాతీయ జెండా ముద్రించబడి ఉంటుంది. మరి ఈ విమానాల ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..

1. రూ.8,585 కోట్లతో..

2018లో బోయింగ్​ 777 విమానాలను ఆర్డర్​ ఇచ్చారు. కొత్తగా రానున్న ఈ విహంగాలను ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రాథమిక ప్రయాణికులుగా ఉంటారు. వీరితోపాటు ఇతర ఉన్నతస్థాయి నేతలకూ ఈ శ్రేణి విమానాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. వీటి కోసం ఏకంగా రూ.8,458 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ విమానాలు ఫ్లోరిడాలోని బోయింగ్​ ప్రధాన కార్యాలయంలో తయారవుతున్నాయి.

2. ఐఏఎఫ్​ చేతుల్లోనే...

ఈ రెండు బోయింగ్​ విమానాలు భారత వాయిసేన (ఐఏఎఫ్​) ఆధ్వర్యంలో ఉంటాయి. తొలుత ఎయిర్​ ఇండియా పేరిట రిజిస్ట్రేషన్​ చేయించారు. అనంతరం దాన్ని ఐఏఎఫ్​ పేరుకు మార్చారు. ప్రస్తుతం మోదీ, కోవింద్ ప్రయాణించే బోయింగ్​ 747 విమానాలకు ఎయిర్​ఇండియా ఉద్యోగులే పైలట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ బోయింగ్​ 777ను మాత్రం భారత వాయుసేన పైలట్లు నడుపుతారు. ఇందుకోసం 4 నుంచి 6 ఐఏఎఫ్ పైలట్లకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది.

3. అత్యంత శక్తిమంతం...

ఈ విమానాల్లో మొత్తం 342 సీట్లు ఉంటాయి. 4 ఫస్ట్​క్లాస్​, 35 బిజినెస్​ క్లాస్​, 303 ఎకానమీ క్లాస్​ సీట్లు ఉంటాయి. విమానం పొడవు.. 242.2 అడుగులు. బరువు 143 టన్నులు. ఒక్కో రెక్క పొడవు 212.7 అడుగులు. ఇది 43,100 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. ఇందులో అమర్చిన జనరల్​ ఎలక్ట్రిక్​ జీఈ 90-115 బీఎల్​ ఇంజిన్ చాలా శక్తిమంతమైనది​. ఇది 1.15 లక్షల పౌండ్ల బరువును మోసుకెళ్లగలదు.

4. అత్యాధునిక సాంకేతికత

బోయింగ్​-777లో లగ్జరీ ఫర్నిచర్​ ఉంటుంది. భద్రత ప్రధానంగా రూపొందించిన ఈ విమానంలో ప్రత్యేకమైన క్షిపణి నిరోధక వ్యవస్థను నిక్షిప్తం చేశారు. అమెరికా రక్షణ సహకార ఏజెన్సీ (డీఎస్​సీఏ) రూపొందించిన లార్జ్ ఎయిర్​క్రాఫ్ట్ ఇన్​ఫ్రారెడ్ కౌంటర్​మీజర్స్ (ఎల్​ఏఐఆర్​సీఎం)​, స్వీయ రక్షణ సూట్లు (ఎస్పీఎస్​) ఉంటాయి. వీటికి క్షిపణి హెచ్చరిక సెన్సార్లు (డబ్ల్యూఎంఎస్​), కంట్రోల్ ఇంటర్​ఫేస్​ యూనిట్​(సీఐయూ) అదనం. వీటి సాయంతో ఇన్​ఫ్రారెడ్ క్షిపణులను పసిగట్టి.. నియంత్రించొచ్చు. వీటన్నింటికి సంబంధించిన శిక్షణను పైలట్లకు ఇస్తారు.

ఈ సాంకేతికతలను అమెరికా ఢిఫెన్స్​ సెక్యూరిటీ కార్పొరేషన్​ ఏజెన్సీ(డీఎస్​సీఏ) అందించింది. రెండు రక్షణ వ్యవస్థలను భారత్​కు రూ.1,357 కోట్లకు అమ్మేందుకు 2019 ఫిబ్రవరిలో అమెరికా అంగీకరించింది. అణుబాంబు ప్రయోగించినప్పుడు వచ్చే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్​ పల్స్​ వల్ల విమానంలోని సాంకేతిక వ్యవస్థ చెడిపోకుండా.. 238 మైళ్ల పొడవున్న వైరింగ్​తో అన్ని ఎలక్ట్రానిక్స్​కు భద్రత ఏర్పరిచారు.

5. లగ్జరీకి మారుపేరు..

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన విమానాల్లో ఇదొకటి. ఇందులో కాన్ఫరెన్స్​ రూమ్​, వీఐపీ గదులు, వైఫై, అత్యవసర వైద్య సదుపాయం కోసం ప్రత్యేక ట్రాన్స్​పోర్ట్​ యూనిట్​ ఉంటాయి. ఇది సాధారణంగా ప్రయాణికుల కోసం తయారు చేస్తారు. అయితే వాటిని రీమోడల్​ చేసి వీవీఐపీల కోసం సిద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్​ఫోర్స్​ వన్​ స్ఫూర్తితో దీనికి అన్ని రకాల హంగులు కల్పించారు.

ఒక్కో విమానం ఖరీదు రూ.2,600 కోట్లు. రక్షణ వ్యవస్థ రూ.1,350 కోట్లు. అదనపు ఇంజిన్లకు రూ.782 కోట్లు. కేబిన్​ ఓవర్​హాల్​కు రూ.942 కోట్లు. మొత్తంగా 2 విమానాలకు రూ.8,458 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అగ్ని రహస్యం బయటకు వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.