ETV Bharat / bharat

నేటి నుంచి భారత్- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు

సముద్ర క్షేత్రంలో పరస్పర సహకారం లక్ష్యంగా భారత్, శ్రీలంక సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహించనున్నాయి. స్లినెక్స్-20 పేరిట నిర్వహించే ఈ ప్రదర్శనలు అక్టోబర్ 19-21 మధ్య శ్రీలంకలోని ట్రింకోమలీలో జరగనున్నాయి.

Indian Sri Lanka Maritime Exercise
భారత్- శ్రీలంక నౌకాదళ విన్యాసాలు
author img

By

Published : Oct 19, 2020, 5:00 AM IST

‌భార‌త్​, శ్రీ‌లంక సంయుక్తంగా నౌకద‌ళ విన్యాసాలు 'స్లినెక్స్-20' నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. శ్రీ‌లంక‌లోని ట్రింకోమ‌లీలో ఈ నెల 19-21 మధ్య ఈ విన్యాసాలు జ‌రుగునున్నాయి. ఇంటర్-ఆప‌రేట‌బిలిటీ, పరస్పర అవగాహన, బహుముఖ సముద్ర కార్యకలాపాల కోసం ఉత్తమ పద్ధతులు, విధానాలను మార్పిడి చేయడం లక్ష్యంగా ఈ ప్రదర్శనలను నిర్వహించనున్నారు.

ఈ విన్యాసాల్లో దేశీయంగా నిర్మించిన యుద్ధనౌకలు, విమానాల సామర్థ్యాల్ని ప్రదర్శించ‌నున్నారు. గన్​ ఫైరింగ్, సీమన్‌షిప్, క్రాస్ డెక్ ఫ్లయింగ్ కార్యకలాపాలతో సహా ప‌లు ఉపరితల, యాంటీ ఎయిర్ కసరత్తులు ఈ ఏడాది విన్యాసాల్లో భాగం కానున్నాయి. గ‌త ఏడాది స్లినెక్స్-19 నావికా ద‌ళ విన్యాసాలు విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హించారు.

భారత్​ తరఫున..

దేశీయంగా నిర్మించిన ఏఎస్​డబ్ల్యూ కొర్వెట్ట‌స్ కమోర్తా, కిల్తానందర్‌తో స‌హా ఈశాన్య ఫ్లీట్‌ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రేర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌.. భారత దళానికి ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నారు. ఆయా నౌక‌ల్లో ఏర్పాటు చేసిన భార‌త‌ నేవీ 'అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌‌', చేత‌క్ హెలికాప్టర్, ఆన్‌బోర్డ్ ఇన్‌షిప్‌ ఈ విన్యాసాల‌లో భాగం కానున్నాయి. వీటితో పాటుగా సముద్ర గస్తీ విమానం 'డోర్నియర్' కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది.

శ్రీ‌లంక ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నావల్ ఫ్లీట్ రేర్ అడ్మిరల్ బండారా జయతిలకా నేతృత్వంలోని సయూరా, గజబాహు నౌకలు ఈ విన్యాసాల‌లో పాల్గొనున్నాయి.

ఇదీ చూడండి: నడిరేయిలో 'పృథ్వీ-2' ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.