ETV Bharat / bharat

భారత్ చేతికి 'ప్రిడేటర్'​ డ్రోన్లు- చైనాతో సై! - ఇండియా నేవీ

భారత నావికాదళం ఓ అమెరికా సంస్థ నుంచి రెండు ప్రిడేటర్​ డ్రోన్లను లీజుకు తీసుకుంది. ప్రస్తుతం వీటిని హిందూ మహా సముద్రంలో నిఘా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించే అవకాశముందని తెలుస్తోంది.

Indian Navy inducts two American Predator drones on lease, can be deployed on China border
భారత్ చేతికి 'ప్రిడేటర్'​ డ్రోన్లు- చైనాతో సై!
author img

By

Published : Nov 25, 2020, 6:24 PM IST

ఓ అమెరికా సంస్థ నుంచి రెండు ప్రిడేటర్​ డ్రోన్లను లీజుకు తీసుకుంది భారత నావికాదళం​. ప్రస్తుతం వీటిని హిందూ మహా సముద్రంలో నిఘా కోసం వినియోగిస్తోంది. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రిడేటర్​ డ్రోన్లను తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

భారత్​-చైనా సరిహద్దు ఉద్రిక్తల నేపథ్యంలో రక్షణశాఖ అత్యవసర కొనుగోళ్లకు అనుమతులివ్వడం వల్ల ఈ డ్రోన్లను తీసుకుంది భారత నావికాదళం.

ఈ నెల మొదటి వారంలో ఈ డ్రోన్లు తమకు అందాయని.. ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని నౌకాదళం వెల్లడించింది. 30 గంటల పాటు నిర్విరామంగా ప్రయాణించగలిగే సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతమని, ఇది నౌకాదళానికి పెద్ద ఆస్తి అని అధికారులు వెల్లడించారు.

ఈ రెండు డ్రోన్లను ఏడాది పాటు లీజుకు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఇలాంటి మరో 18 డ్రోన్లను పొందేందుకు త్రివిధ దళాలు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:- ట్రాన్స్​ జెండర్లకు త్వరలో ప్రత్యేక హెల్ప్​లైన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.