దేశ భద్రతకు సంబంధించి శత్రు దేశాలకు కీలక సమాచారం చేరవేస్తూ ఇటీవల ఏడుగురు సిబ్బంది పట్టుబడిన క్రమంలో కఠిన చర్యలకు ఉపక్రమించింది నావికాదళం. బేస్ క్యాంపులు, యుద్ధ నౌకలు, డాక్యార్డులు సహా నావికాదళానికి సంబంధించిన ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకంపై నిషేధం విధించింది. నౌకా దళ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫేస్బుక్ వాడరాదని స్పష్టంచేసింది.
ఇతర సామాజిక మధ్యమాలు, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లు, ఈ-కామర్స్ సైట్లను ఉపయోగించడంపై త్వరలోనే నిషేధం విధించాలని భావిస్తున్నట్లు తెలిపింది నావికా దళం.
ఇదీ చదవండి: 'పౌర' చట్టానికి వ్యతిరేకంగా రంగవల్లులతో డీఎంకే నిరసన