భారత విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి. 'క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ర్యాంకింగ్స్-2020'లో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్సీ బెంగళూరు నిలిచాయి.
అగ్రశ్రేణి 400 జాబితాలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్పుర్, ఐఐటీ కాన్పుర్, ఐఐటీ రూర్కీ ఉన్నాయి. 1000 జాబితాలో ఓపీ జిందాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (జేజీయూ) సహా 50 కొత్త సంస్థలు ఉన్నాయి. స్థాపించిన అతి కొద్ది కాలంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న విద్యాసంస్థగా జేజీయూ నిలిచింది.
అగ్రశ్రేణి 200 జాబితాలో భారత విద్యాసంస్థలు రాణించటంపై కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు.
-
यह अत्यंत गर्व का विषय है कि विश्व की प्रतिष्ठित QS रैंकिंग में आईआईटी (IIT) मुंबई, दिल्ली और (IISc) बैंगलोर को शीर्ष 200 संस्थाओं में सम्मिलित किया गया है ।
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">यह अत्यंत गर्व का विषय है कि विश्व की प्रतिष्ठित QS रैंकिंग में आईआईटी (IIT) मुंबई, दिल्ली और (IISc) बैंगलोर को शीर्ष 200 संस्थाओं में सम्मिलित किया गया है ।
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 19, 2019यह अत्यंत गर्व का विषय है कि विश्व की प्रतिष्ठित QS रैंकिंग में आईआईटी (IIT) मुंबई, दिल्ली और (IISc) बैंगलोर को शीर्ष 200 संस्थाओं में सम्मिलित किया गया है ।
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 19, 2019
ఇదీ చూడండి: తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!