ETV Bharat / bharat

కాసేపట్లో 'సార్వత్రికం' తుది దశ సమరం - ఉత్తరప్రదేశ్​

సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకుంది. చివరిదైన ఏడో విడతలో 59 లోక్​సభ స్థానాలకు కాసేపట్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ దశ ఎన్నికలే ఫలితాలను శాసిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాసేపట్లో 'సార్వత్రికం' తుది దశ సమరం
author img

By

Published : May 19, 2019, 5:52 AM IST

కాసేపట్లో 'సార్వత్రికం' తుది దశ సమరం

లోక్​సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు దశలు పూర్తికాగా ఆఖరిదైన ఏడో విడత పోలింగ్ కాసేపట్లో మొదలుకానుంది. ఓటింగ్​ ప్రక్రియ సజావుగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

ఏడో విడతలో భాగంగా 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 10.01 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

కట్టుదిట్టమైన భద్రత

పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే బంగాల్​లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఎన్నికల సంఘం.

భాజపాకు కీలకం

చివరి దశ నిర్ణయాత్మకమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడో దశలోని స్థానాలు భాజపాకు కీలకం కానున్నాయి. 2014 లోక్​సభ ఎన్నికల్లో ఎక్కువ మంది భాజపా అభ్యర్థులు ఈ దశలోని స్థానాల్లోనే గెలిచారు. వీటిని నిలుపుకుంటేనే భాజపా తిరిగి అధికారం సాధించగలుగుతుందని నిపుణుల విశ్లేషణ. బంగాల్​ మినహా మిగతావన్నీ హిందీ రాష్ట్రాలే కావటం విశేషం.

ప్రముఖ స్థానాలు

వారణాసి (ఉత్తరప్రదేశ్): ప్రధాని నరేంద్రమోదీ ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్​ తరఫున అజయ్​ రాయ్​, ఎస్పీ తరఫున షాలినీ యాదవ్​ బరిలో ఉన్నారు.
పాటలీపుత్ర (బిహార్​): ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ కుమార్తె మిశా భారతి పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి లాలూ మాజీ సన్నిహితుడు, కేంద్రమంత్రి రామ్​ కృపాల్​ యాదవ్​ బరిలో ఉన్నారు.

పట్నా సాహిబ్ (బిహార్​): ఒకప్పటి సహచరులు ప్రత్యర్థులుగా మారారు. కేంద్ర మంత్రి రవిశంకర్​ప్రసాద్​, సిట్టింగ్​ ఎంపీ, కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా మధ్య పోటీ ఆసక్తికరం.

గురుదాస్​పుర్ (పంజాబ్​)​: రాష్ట్రంలో భాజపా ఆశలు పెట్టుకున్నది సన్నీ దేఓల్​పైనే. ప్రత్యర్థిగా కాంగ్రెస్​ నుంచి సునీల్​ కుమార్​ జాఖర్​ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.

పంజాబ్​లో శిరోమణి అకాలీదళ్​ అధినేత సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​, ఇద్దరు కేంద్రమంత్రులు హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, హర్​దీప్​ సింగ్​ పురి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇదీ చూడండి: మోదీకి పరువునష్టం నోటీసులు పంపిన 'దీదీ' మేనల్లుడు

Aurangabad (Maharashtra), May 18 (ANI): As the drought is worsening in Maharashtra, the government on Saturday set up a fodder camp aka 'Chara Chawani' for cattle in the drought-hit Aurangabad district's Lasur village. While speaking to ANI, a local said, "About 1,200 farmers from 3 tehsils bring nearly 6,300 cattle here for fodder and water. There is proper medical care for cattle, CCTV and firefighting equipments are also installed." The India Meteorological Department (IMD) has predicted that the region will receive rainfall after a delay of at least by a week. The organisation also predicted that the mercury levels across the state of Maharashtra will surge from May 19.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.