ETV Bharat / bharat

భారత సైనిక కమాండర్ల భేటీకి సర్వం సిద్ధం

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం కమాండర్ల భేటీకి సర్వం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత ఆర్మీ ఉప అధిపతి, కమాండర్లు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొనున్నారు.

Indian Army set to hold Commanders' Conference
భారత సైనిక కమాండర్ల భేటీకి సర్వం సిద్ధం
author img

By

Published : Oct 26, 2020, 5:37 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత సైనిక కమాండర్ల భేటీకి రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ద్వైవార్షిక సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులు సహా వ్యయాలను తగ్గించేందుకు వస్తున్న ప్రతిపాదనపై సైనికాధికారులు చర్చించనున్నారు.

అక్టోబర్​ 26 నుంచి 29 వరకు దిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సైన్యంలోని అత్యున్నత అధికారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. భారత ఆర్మీ ఉప అధిపతి, కమాండర్లు, సైనిక ప్రధాన కార్యాలయ ప్రిన్సిపల్ స్టాఫ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొనున్నారు.

మొదటి రోజు భేటీలో మానవ వనరుల అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 27న రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ భేటీలో ప్రసంగించనున్నారు. త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్య, నావిక, వాయుసేన అధిపతులు సైతం సమావేశంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి- 'చైనా, పాక్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమేనా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.