కయ్యాలమారి చైనా కాటేసేందుకు కాచుకుని కూర్చొన్నా, దీటైన జవాబిచ్చే సత్తా ఉన్న భారత్ మాత్రం ఎంతో సంయమనాన్ని పాటిస్తూ వస్తోంది. గల్వాన్ ఘటనలో మన సైనికులను పొట్టన పెట్టుకున్నా.. పొరబాటున భారత భూభాగంలోకి వచ్చిన వారి పౌరుల ప్రాణాలు నిలబెట్టింది. దారితప్పి మన భూబాగంలోకి వచ్చిన చైనీయులను భారత సైన్యం ఆదుకుంది.
-
मानवता सर्वोपरि#IndianArmy extends help and #Medical assistance to stranded #Chinese citizens at the India - China Border of #NorthSikkim at altitude of 17,500 feet under extreme climatic conditions.
— ADG PI - INDIAN ARMY (@adgpi) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
For #IndianArmy #Humanity is foremost#HumanValues#IndianArmy#NationFirst pic.twitter.com/mdW7Tka0wo
">मानवता सर्वोपरि#IndianArmy extends help and #Medical assistance to stranded #Chinese citizens at the India - China Border of #NorthSikkim at altitude of 17,500 feet under extreme climatic conditions.
— ADG PI - INDIAN ARMY (@adgpi) September 5, 2020
For #IndianArmy #Humanity is foremost#HumanValues#IndianArmy#NationFirst pic.twitter.com/mdW7Tka0woमानवता सर्वोपरि#IndianArmy extends help and #Medical assistance to stranded #Chinese citizens at the India - China Border of #NorthSikkim at altitude of 17,500 feet under extreme climatic conditions.
— ADG PI - INDIAN ARMY (@adgpi) September 5, 2020
For #IndianArmy #Humanity is foremost#HumanValues#IndianArmy#NationFirst pic.twitter.com/mdW7Tka0wo
కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చైనీయులు దారి తప్పి.. భారతదేశంలోని ఉత్తర సిక్కిం ప్రాంతానికి చేరుకున్నారు. సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో అక్కడి వాతావరణ స్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అల్లాడుతున్న చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆక్సిజన్, ఆహారం, వెచ్చని దుస్తులు అందించటమే కాకుండా వారు తిరిగి వెళ్లేందుకు దారి చూపింది.
సెప్టెంబర్ 3న చోటుచేసుకున్న ఈ సంఘటనకు గురించిన వివరాలను భారత సైన్యం నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. రాజకీయ, సైనికపరంగా వైషమ్యాల సంగతి ఎలా ఉన్నా... శత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.
ఇదీ చూడండి: చైనా రక్షణమంత్రి ముందే తేల్చిచెప్పిన రాజ్నాథ్